అమెజాన్‌ బాస్‌ పంటపండింది.. ఏకంగా లక్షా నలభై వేల కోట్లకు పైనే పెరిగిన సంపద

4 Feb, 2022 16:04 IST|Sakshi

ఆయన తల్చుకుంటే.. బోడిగుండుపైన జుట్టు మొలిపించుకోవడం ఎంత సేపు? కానీ, ఆయనకది ఇష్టం లేదు. ఎందుకంటే.. సక్సెస్‌ అనేది లుక్కులో కాదు.. లక్కులో, హార్డ్‌ వర్క్‌లో ఉందని నమ్ముతున్నాడాయన. అందుకే గుండ్‌ బాస్‌గా పాపులర్‌ అయ్యాడు. ఆయనే అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌.  

జెఫ్‌ బెజోస్‌(58).. అమెజాన్‌ అనే ఈ-కామర్స్‌ కంపెనీతో సంచలనాలకు నెలవయ్యాడు. అమెజాన్‌ సీఈవో బాధ్యతల నుంచి పక్కకు జరిగాక.. సొంత స్పేస్‌ కంపెనీ బ్లూఆరిజిన్‌ మీదే ఆయన ఫోకస్‌ ఉంటోంది. అయితే గత కొంతకాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు ఆయన(ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం). ఈ తరుణంలో తాజా పరిణామాలు బెజోస్‌కి బాగా కలిసొచ్చాయి. 


అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ

అమెజాన్‌ ఆమధ్య ఈవీ కంపెనీ రివియన్‌లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు ప్రైమ్‌ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో షేర్ల ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 15 శాతం పెరగ్గా.. అక్టోబర్‌ 2009 నుంచి ఇదే అధికం కావడం గమనార్హం. మరోవైపు అమెజాన్‌ కేవలం అడ్వర్‌టైజింగ్‌ బిజినెస్‌ల ద్వారా 31 బిలియన్‌ డాలర్లు సంపాదించుకోవడం గమనార్హం. ఈ దెబ్బతో బెజోస్‌ వ్యక్తిగత సంపద 20 బిలియన్‌ డాలర్లకు(మన కరెన్సీలో లక్షా నలభై వేల కోట్ల రూ.) పెరిగింది. ప్రస్తుతం ఈయన మొత్తం సంపద విలువ.. 164.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

ఒకవైపు ఫేస్‌బుక్‌ యూజర్ల ఎఫెక్ట్‌తో జుకర్‌బర్గ్‌ ఒక్కరోజులోనే 2.2 లక్షల కోట్ల రూపాయలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్‌తో రియల్‌ టైం బిలియనీర్ల జాబితాలో దిగజారిపోగా.. భారతీయ బిజినెస్‌ టైకూన్స్‌ ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలు జుకర్‌బర్గ్‌ కంటే పైస్థానాల్లోకి ఎగబాకడం తెలిసిందే.

చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం!

మరిన్ని వార్తలు