WhatsApp డేటా బ్రీచ్‌ కలకలం: ఆ మెసేజెస్‌ కాల్స్‌కి,స్పందించకండి!

26 Nov, 2022 18:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌లో డేటా బ్రీచ్‌ యూజర్లకు భారీ షాకిస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల  ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌ సేల్‌ అయ్యాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.  యూఎస్‌, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారతదేశంతో సహా 84 వేర్వేరు దేశాల వాట్సాప్‌ వినియోగదారుల మొబైల్ నంబర్లను ఆన్‌లైన్‌లో  విక్రయానికి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

50 కోట్ల యూజర్ల ఫోన్‌ నంబర్లు విక్రయానికి

సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్న ఈ వ్యవహారంలో దాదాపు 500 మిలియన్ల వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్ల  డేటాబేస్  ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. 2022 డేటాబేస్‌లో 487 మిలియన్ల యూజర్ల మొబైల్ నంబర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక థ్రెట్‌యాక్టర్‌ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. డేటా బ్రీచ్‌ ద్వారా సేకరించిన సమాచారంతో ఫిషింగ్ ఎటాక్స్‌ చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగ దారులు తెలియని నంబర్ల  కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

వాట్సాప్​ డేటాసెట్​
ఈ డేటా బ్రీచ్‌లో మ‌న‌దేశంలో 61.62 ల‌క్ష‌ల మంది, అమెరికాకు చెందిన 32 మిలియన్​ మంది ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఈజిప్ట్​ నుంచి 45 మిలియన్లు,  ఇటలీ నుంచి 35 మిలియన్లు సౌదీ నుంచి 29 మిలియన్లు​, ఫ్రాన్స్​నుంచి 20 మిలియన్​, టర్కీ నుంచి 20 మిలియన్ల మంది డేటా ఉన్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన 10మిలియన్ల యూజర్లు, యూకే నుంచి 11మిలియన్​ పౌరుల ఫోన్ నంబర్ల డేటా లీక్​ అయినట్టు తెలిపింది. అమెరికా  యూజర్ల డేటాను  7వేల డాలర్లు (సుమారు రూ. 5,71,690)కి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్‌ల ధర వరుసగా 2,500 డాలర్లు (సుమారు. ₹2,04,175) 2వేల డాలర్లు (సుమారుగా ₹1,63,340) అమ్మకానికిపెట్టినట్టు నివేదించింది.

కాగా మెటా, తన ప్లాట్‌ఫారమ్స్‌లో డేటా బ్రీచ్‌ ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, 500 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. లీకైన డేటాలో ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు లీకైన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు