లగ్జరీ డ్యూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?

9 May, 2023 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:పాన్-ఇండియా స్టార్ సమంతా రూత్ ప్రభు కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన సమాచారం ఇపుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, 13వ అంతస్తులో కొనుగోలు చేసిన ఇల్లు 3,920 చదరపు అడుగులతో 7,944 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియా , 14వ అంతస్తులో 4,024 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్యూప్లెక్స్ ఏరియాతో ఉంది.  

దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే   హీరోయిన్లలో ఒకరైన సమంతా  తాజాగా అత్యంత ఖ‌రీదైన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ (డ్యూప్లెక్స్‌) కొత్త‌గా సామ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో జ‌య‌భేరి కౌంటీ గేటెడ్ క‌మ్యూనిటీలో  ఖ‌రీదైన డూప్లెక్స్ ప్లాట్‌ను తాజాగా స‌మంత సొంతం చేసుకుంది. 

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఆరు పార్కింగ్ స్లాట్‌లతో  జయభేరి ఆరెంజ్ కౌంటీలో 3BHK లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ 13, 14 ఫ్లోర్‌ల‌లో ఉందని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ నివేదించింది. దీని ఖ‌రీదు అక్ష‌రాలా రూ.7.8 కోట్లు. ఇటీవల ముంబైలో రూ. 15 కోట్ల విలువైన రాజభవన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతోపాటు జూబ్లీహిల్స్‌లో 100 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కూడా ఉందట. దీంతో ఆమె నికర విలువ రూ. 89 కోట్లుగా తెలుస్తోంది. 

 

టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సమంతా రీసెంట్‌గా గుణ‌శేఖ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మైథ‌లాజిక‌ల్ డ్రామా `శాకుంత‌లం`తో  ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.కాళిదాసు నాటకం ఆధారంగా, శకుంతల, పెరూ రాజవంశం రాజు దుష్యంత్‌ల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవ్ మోహన్ కూడా నటించారు.భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  కేవలం రూ.11 కోట్లు మాత్రమే  పెద్దగా సక్సెస్‌ కాలేకపోయింది.  శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌. హిందీ భాష‌ల్లో సెప్టెంబర్ 1న  విడుదల కానుంది.  మరోవైపు  విజయ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం రిలీజైన ఈ మూవీలో ఫస్ట్‌ సింగిల్‌పై ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మరిన్ని వార్తలు