పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్‌ నుంచి ఇలా తీసుకోండి..

18 Mar, 2023 15:47 IST|Sakshi

ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ పీఎఫ్‌ అకౌంట్‌ అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ ఉంటుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని ఇందులో పొదుపు చేస్తుంటారు. పీఎఫ్‌ ఖాతాలో ఉన్న సొమ్ముకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంత వడ్డీని చెల్లిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 8.1 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ఇలా పొదుపు చేసిన డబ్బు కష్ట సమయాల్లో ఉపయోపడుతుంది. అవసరమైనప్పుడు పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌ సంస్థ అవకాశం కల్పిస్తోంది.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్‌!

కొత్తగా వచ్చిన పీఎఫ్‌ ఉపసంహరణ నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్‌ సభ్యులు వివాహ సంబంధిత ఖర్చుల కోసం వారి ఖాతాలో ఉన్న సొమ్ము నుంచి కొంత మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. స్వయంగా వధూవరులు కానీ లేదా ఖాతాదారు కుమారుడు, కుమార్తె, సోదరుడు, సోదరి వివాహాల నిమిత్తం డబ్బు ఉపసంహరించుకోవచ్చు. అయితే పీఎఫ్‌ ఖాతాలో ఏడేళ్ల పాటు డబ్బు జమ చేసి ఉండాలి. 

విత్‌డ్రా ఎంత చేసుకోవచ్చు?
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతం వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. అయితే ప్రావిడెంట్ ఫండ్‌లో ఏడేళ్ల సభ్యత్వం కచ్చితంగా ఉండాలి. ముందస్తు ఉపసంహరణపై ఈపీఎఫ్‌ పరిమితులు విధించింది. పిల్లల స్కూల్‌ ఖర్చులు, పెళ్లి ఖర్చుల కోసం ఒక్కో సందర్భానికి మూడు సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంట్లో నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సులువుగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 72 గంటల తర్వాత డబ్బు బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అవుతుంది.

తగ్గిన టీడీఎస్‌
ఈపీఎఫ్‌  ఉపసంహరణలపై విధించే టీడీఎస్‌ను ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 20 శాతానికి తగ్గించింది. గతంలో ఇది 30 శాతం ఉండేది. ఐదేళ్ల లోపు ఈపీఎఫ్‌ ఖాతా నుంచి ఉపసంహరించుకునే ప్రతిఒక్కరికీ టీడీఎస్‌ వర్తిస్తుంది.

ఇదీ చదవండి: సుందర్‌ పిచాయ్‌.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు