ఎస్కార్ట్స్‌ లాభం హైజంప్‌

6 Aug, 2021 01:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల దిగ్గజం ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 178 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ1లో రూ. 92.6 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,089 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో ట్రాక్టర్‌ విక్రయాలు 43 శాతం ఎగసి 25,935 యూనిట్లను తాకాయి. వ్యవసాయ పరికరాల విభాగం ఆదాయం రూ. 977 కోట్ల నుంచి రూ. 1,436 కోట్లకు ఎగసిందని కంపెనీ పేర్కొంది.
ఫలితాల నేపథ్యంలో ఎస్కార్ట్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలహీనపడి రూ. 1,223 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు