Expensive Bikes: వారెవ్వా..ఒక్కసారి నడిపితే

4 Jun, 2021 17:16 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: ఇండియాలో బైకులకు క్రేజ్‌  రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ముఖ్యంగా తన రీ ఎంట్రీతో మార్కెట్‌ని షేక్‌ చేసింది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. ఖరీదైన బైకులకు మంచి మార్కెట్‌ను సిద్ధం చేసింది. ఆ తర్వాత లక్షల రూపాయల విలువ చేసే బైకులు మార్కెట్లోకి వచ్చాయి.. వస్తున్నాయి. కుర్రకారు అయితే క్యాష్‌ కంటే బైక్‌ డిజైన్‌, పవర్‌కే ప్రిఫరెన్స్‌ ఇస్తూ హై ఎండ్‌ బైకులు కొనేందుకు సై అంటున్నారు. ధర అధికంగా ఉన్నా  ఇండియా మార్కెట్‌లో క్రమంగా విస్తరిస్తున్న ఐదు ఖరీదైన బైకులపై ఓ లుక్కేద్దాం. 

కవాసాకి నింజా H2R
కవాసాకి నింజా H2R బైక్‌ని 2019లో ఇండియా మార్కెట్‌లోకి తెచ్చారు. 998 సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైక్‌ వేగానికి, పవర్‌కి మరో పేరు.  326 హార్స్‌పవర్‌ సామర్థంతో ఈ బైకుపై రివ్వున దూసుకు పోవచ్చు. అయితే బైకును రోడ్లపై నడిపేందుకు మన ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రేసింగ్‌ రోడ్లపై నడిపేందుకే అనుమతి ఉంది. ఈ బైక్‌ ధర రూ.79.90 లక్షలుగా ఉంది.

బీఎండబ్ల్యూ  M 1000 RR
లగ్జరీ కార్లు, హై ఎండ్‌కార్లలో స్పెషల్‌ స్టేటస్‌ బీఎండబ్ల్యూ సొంతం. అదే స్థాయిని కాపుడుకుంటూ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో బీఎండబ్ల్యూ M 1000 RR మోడల్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. క్షణాల్లో గంటకు 300 కి.మీ వేగానికి చేరుకోవడం దీని ప్రత్యేకత. ఈ బైకు ధర రూ. 42 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ఉంది.

ఇండియన్‌ రోడ్‌ మాస్టర్‌
వింటేజ్‌ లుక్‌తో పవర్‌ఫుల్‌ ఇంజన్‌తో రైడర్లిద్దరికి లగ్జరీ అందించే బైకుగా రోడ్‌మాస్టర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఇండియన్‌ మోటార్‌ సైకిల్‌ ఈ బైకును మార్కెట్‌లోకి తెచ్చింది. సాధారణంగా అన్ని బైకులు రైడర్‌ కంఫర్ట్‌కి ప్రాధాన్యత ఇస్తాయి. కానీ రోడ్‌ మాస్టర్‌లో వెనక కూర్చునే వ్యక్తి కోసం ప్రత్యేక డిజైన్‌ చేసింది ఇండియన్‌ మోటర్‌ సైకిల్‌ సంస్థ. ఈ బైకు ధర 43 లక్షల నుంచి మొదలవుతుంది. 

హార్లే - డేవిడ్‌సన్‌ రోడ్‌ గ్లైడ్‌ స్పెషల్‌
హర్లే డేవిడ్‌సన్‌ నుంచి వచ్చిన రోడ్‌ ‍గ్లైడ్‌ స్పెషల్‌ బైక్‌ని నడుపుతుంటే... గాల్లో తేలినట్టుందే.. గుండే జారినట్టుందే అనే ఫీలింగ్‌ రాకమానదు. ఇండియన్‌ వింటేజ్‌ స్టైల్‌లోనే క్లాసిక్‌ ప్లస్‌ మోడ్రన్‌ లుక్‌ విత్‌ ఇన్ఫోంటైన్‌మెంట్‌ ఫెసిలిటీతో వచ్చింది గ్లైడ్‌ స్పెషల్‌ బైక్‌. ఈ బైకులు మార్కెట్‌లో రూ. 35 లక్షలు నుంచి లభిస్తున్నాయి. 

చీఫ్‌స్టైయిన్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌
క్లాసిక్‌, ఎథ్నిక్‌ లుక్‌తో మోడ్రన్‌ బైకులు తయారు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఇండియన్‌ మోటర్‌ సైకిల్‌ సంస్థ నుంచి వచ్చిన మరో బైక్‌ చీఫ్‌స్టైయిన్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌. ఎల్‌ఈడీ లైటింగ్‌, బ్లూటూత్‌, ఆపిల్‌ కార్‌ ప్లే వంటి అధునాతన సదుపాయలు ఈ బైక్‌ సొంతం. ఈ బైకు సొంతం చేసుకోవాలంటే రూ. 33 లక్షలకు పైగానే సొమ్ములు రెడీ చేసుకోవాలి. 

మరిన్ని వార్తలు