150 బిలియన్‌ డాలర్లకు ఫిన్‌టెక్‌ పరిశ్రమ

10 Jun, 2022 14:37 IST|Sakshi

2025 నాటికి చేరుకుంటుంది 

కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి చౌదరి  

న్యూఢిల్లీ: భారత ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ల వృద్ధి అసాధారణ స్థాయిలో ఉందని.. ఈ మార్కెట్‌ 2025 నాటికి 150 బిలియన్‌ డాలర్ల స్థాయికి (రూ.11.55 లక్షల కోట్లకు) విస్తరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి అన్నారు. అసోచా మ్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. భారత ఫిన్‌టెక్‌ రంగం భారీ వృద్ధిని చూస్తోందని.. దేశంలోనే కాకుండా, విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు.

 ‘‘దేశంలో మెజారిటీ స్టార్టప్‌లు ఏర్పాటై పదేళ్లు కూడా కాలేదు. కానీ గత కొన్నేళ్లుగా ఇవి చూపిస్తున్న వృద్ధి, పనితీరు అద్భుతంగా ఉంది’’అని చెప్పారు. ఫిన్‌టెక్‌ ఆమోద రేటు అంతర్జాతీయంగా సగటున 64 శాతంగా ఉంటే, ఇది మన దేశంలో 87 శాతంగా ఉన్నట్టు చౌదరి తెలిపారు. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ బ్యాంకింగ్‌లో ఎంతో మార్పునకు దారితీసినట్టు, బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ శాఖల అవసరాన్ని తొలగించినట్టు యూఐడీఏఐ సీఈవో సౌరభ్‌ గార్గ్‌ ఇదే కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశవ్యాపప్తంగా 50 లక్షల బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఆధార్‌ ఆధారత వ్యవస్థతో నగదు స్వీకరణ, నగదు చెల్లింపుల లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.    

చదవండి: రుణాలపై వడ్డీ రేట్ల బాదుడు షురూ.. ఈ బ్యాంకుల్లో ఎంతంటే?

మరిన్ని వార్తలు