Flipkart Big Diwali Sale: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్‌ మరో దివాళీ సేల్‌..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!

25 Oct, 2021 13:04 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ మరో సేల్‌తో ముందుకు రానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌ కార్ట్‌  ప్రకటించింది. 

దేశంలో ఫెస్టివల్‌ సీజన్‌ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌ కార్ట్‌ ఫెస్టివల్‌ సేల్‌ పేరుతో వరుస ఆఫర్లను అందిస్తుంది. ఇప్పటికే  బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 3 నుండి 10 వరకు, రెండో సేల్‌ బిగ్ దీపావళి సేల్ పార్ట్ 1 అక్టోబర్ 17 నుండి 23 వరకు నిర్వహించింది. తాజాగా అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3వరకు మరో బిగ్‌ దివాళీ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో కొనుగోలు దారులకు నో కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, డీల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌, ఇతర వస్తువులపై తగ్గింపు, ఎస్‌బీఐ కార్డ్‌లపై  10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్‌ కార్ట్‌ తెలిపింది.   

80శాతం డిస్కౌంట్‌ 
ఫ్లిప్‌ కార్ట్‌ దివాళీ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్స్‌ పై 80శాతం ఆఫర్‌లో సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌లలో రెడ్‌మీ 9ప్రైమ్‌, ఎంఐ 11 లైట్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌12, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌22 వంటి స్మార్ట్‌ఫోన్‌లపై 80శాతం ఆఫర్‌ను అందిస్తుండగా..ఐఫోన్‌ 12 సిరీస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ 2020 ఫోన్‌ ధరలు తగ్గుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

టైమ్ బాంబ్ డీల్స్
సాధారణ డిస్కౌంట్‌లు కాకుండా.. బిగ్ దీపావళి సేల్ సమయంలో కస్టమర్‌లు 12ఏఎం, 8ఏఎం,4 పీఎం సమయాల్లో 'క్రేజీ డీల్స్'ను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 'టైమ్ బాంబ్ డీల్స్' లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా 30 శాతం తగ్గింపుతో లభించనున్నాయి. పవర్ బ్యాంక్‌లు, హెడ్‌ఫోన్‌లు,స్పీకర్‌ల వంటి యాక్సెసరీలను కూడా 75 శాతం వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌ కార్ట్‌లో దేశీయ విమానాల టికెట్లను బుక్‌ చేసుకుంటే రూ. 2,500 వరకు, అంతర్జాతీయ విమానాలపై రూ. 25,000 వరకు తగ్గిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.    

చదవండి: బ్యాంకుల్లో బంపర్‌ ఆఫర్లు..లోన్ల కోసం అప్లయ్‌ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!

మరిన్ని వార్తలు