ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్‌ బిల్లు ఆదా!

7 Dec, 2023 08:24 IST|Sakshi

ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్‌తోపాటు బయటకు కనిపించే వాటికిసైతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్‌ చేయిస్తుంటారు. వంటగది ఎక్కడ రావాలి? పడక గదులు ఎన్ని ఉండాలి? మెట్లు ఏవైపు ఉండాలి? ఎలివేషన్‌ ఎలా ఉంటే బావుంటుందనే విషయాలకే ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఇంటిలో స్థలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఆధునిక భవన డిజైన్లలో కీలకం. అయితే చాలా మంది  జీవితకాలంలో గణనీయ ప్రభావాన్ని చూపే ఇలాంటి అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధానంగా భవనాల డిజైన్‌లో ఈ అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లాంటి నగరంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటి విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. అలాగని సమర్థంగా వినియోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇంట్లో చాలా గదులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పెరిగిన ఇంటి విస్తీర్ణంతో దాని ధర కూడా పెరుగుతుంది. అందరూ అధిక ధరలను భరించలేరు. వీటిని గమనించిన ఆర్కిటెక్చర్లు ఇంటిలోపల స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్‌ చేస్తున్నారు.

ఉదాహరణకు 200 చదరపు అడుగుల స్థలాన్ని లివింగ్‌ రూంకు వదిలిపెడుతుంటారు. అందుకు బదులుగా కొంత అదనంగా మరో 100 చదరపు అడుగుల స్థలాన్ని కలిపి భోజన ప్రదేశంగా, వంటగది వంటి బహుళ అవసరాలకు వినియోగించవచ్చు. అవసరాల్లో రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ‘ఎఫెక్టివ్‌ మల్టిపుల్‌’ అధికంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సగటున కొన్ని సర్వేల ప్రకారం వంటగది, హాల్‌, కిచెన్‌.. వంటి గదుల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని సమర్థంగా వినియోగిస్తే ఎఫెక్టివ్‌ మల్టిపుల్‌ బావుంటుంది. ఎఫెక్టివ్‌ మల్టిపుల్‌ విలువ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని స్థలాన్ని ప్రభావవంతంగా వాడుతున్నట్లు. 

ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత!

ఇంట్లో పడక గదిలో కంటే లివింగ్‌ రూంలో ఎక్కువ సమయం గడిపేవారికి.. పడక గది విస్తీర్ణం తగ్గించుకుని లివింగ్‌ రూం విస్తీర్ణం పెంచుకోవాలి. ఇంటిని సమర్థంగా వాడుకోవానుకున్నా, విశాలంగా కనిపించాలన్నా సహజంగా వెలుతురు వచ్చేలా ఇంటిని డిజైన్‌ చేసుకోవాలి. ఇందుకోసం పెద్ద కిటికీలు క్రాస్‌ వెంటిలేషన్‌ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో కొంతమేర కరెంట్‌ బిల్లు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

>
మరిన్ని వార్తలు