క్యారట్లు వాడిపోకుండా తాజాగా ఉండాలంటే..ఇలా చేయండి!

30 Nov, 2023 08:40 IST|Sakshi

 కొన్న రకాల కాయగూరలు నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉన్నా కూడా పాడైపోతుంటాయి. అలాగే పాల గిన్నెలు లేదా డబ్బాలు ఓ పట్టాన వాసన పోవు అలాంటప్పుడు సింపుల్‌గా ఉంటే చిట్కా ఏదైనా ఉంటే బావుండననిపిస్తుంది. అలాంటి వారికి కోసం ఈ హోం రెమిడ్స్‌. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి.

  • క్యారట్స్‌ ఎండిపోయినట్లు, వాడిపోయినట్లుగా ఉంటే ఒక గిన్నెలో వేసి, క్యారట్స్‌ మునిగేలా నీళ్లు పోయాలి. ఈ గిన్నెమీద మూతపెట్టి రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. పన్నెండు గంటల తరువాత నీటిలో నుంచి క్యారట్స్‌ తీసి చూస్తే తాజాగా ఉంటాయి. ఇప్పుడు తొక్క తీసి చక్కగా వాడుకోవచ్చు. క్యారట్‌ మీద నల్లటి మచ్చలు ఏర్పడినప్పుడు కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది.
  • ఎంత కడిగినా పాల బాటిల్స్‌ వాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు పాల బాటిల్‌లో టేబుల్‌ స్పూను వంటసోడా, కొన్ని నీళ్లు పోసి రాత్రంతా ఉంచాలి. ఉదయం బాటిల్‌ను షేక్‌ చేసి కడిగితే పాల వాసన పోతుంది. ఇదే విధంగా పాల బాటిల్‌లో కొద్దిగా వెనిగర్‌ వేసి షేక్‌ చేసి పక్కన పెట్టాలి. ఆరు గంటల తరువాత వేడి నీటితో కడగాలి. పాల వాసన పోతుంది.

  • 200 ఎమ్‌ఎల్‌ నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల వైట్‌ వెనిగర్, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార వేసి కలపాలి. ఈ నీటిని కుండీల్లోని మొక్కల మట్టిపైన, ఆకులపైన చల్లాలి. ఈ నీరు కీటక నివారిణిగా పనిచేయడమేగాక, మొక్కలకు పునరుజ్జీవాన్ని ఇస్తుంది. 

(చదవండి: ఐస్‌వాటర్‌ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!)

మరిన్ని వార్తలు