StockMarketOPening లాభాలకు చెక్‌, రూపాయి రికార్డు పతనం

20 Oct, 2022 10:28 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నాలుగు రోజుల లాభాలకు చెక్‌ పెట్టింది. ఆరంభంలోనే 230  పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్‌ 59 వేల దిగువకు పడిపోయింది.  నిఫ్టీ కూడా 17500 మార్క్‌ను కోల్పోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దూకుడు కొనసాగిస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తోంది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 111 పాయింట్ల నష్టంతో 58989 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు పతనమై 17479 వద్ద  కొనసాగుతున్నాయి. 

దాదాపు అన్ని రంగాల నష్టపోతున్నాయి.  ఇండస్‌ ఇండ్‌, టైటన్‌, బజాజ్‌ ఆటో, కోల్‌ ఇండియా, బజాజ​ ఫైనాన్స్‌నష్టపోతుండగా, నెస్లే, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, టీసీఎస్‌ లాభాల్లో ఉన్నాయి. 

మరో ఆల్‌టైం కనిష్టానికి రూపాయి
మరోవైపు  దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్టానికి  చేరింది.  బుధవారం డాలరు మారక​ంలో 83 స్థాయికి దిగజారిన కరెన్సీ గురువారం మరో ఆల్‌ టైం కనిష్టాన్ని నమోదు చేసింది.  17 పైసలు నష్టంతో 83.16 వద్ద ఉంది. 
 

మరిన్ని వార్తలు