పసిడి- వెండి.. మిలమిల

21 Aug, 2020 10:13 IST|Sakshi

ప్రస్తుతం10 గ్రాముల పసిడి రూ. 52,385కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 68,700 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో 1,958 డాలర్లకు పసిడి

స్పాట్‌ మార్కెట్లోనూ ఔన్స్‌ 1,951 డాలర్లకు

27.65 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి ధర 

కొద్ది రోజులుగా ఆటుపోట్లను చవిచూస్తున్న బంగారం, వెండి.. ధరలు తాజాగా బలపడ్డాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం  రూ. 234 పుంజుకుని రూ. 52,385 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 1105 జంప్‌చేసి రూ. 68,700 వద్ద కదులుతోంది. 

గురువారమిలా
బుధవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 471 క్షీణించి రూ. 52,151 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52,550 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,721 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 368 తక్కువగా రూ. 67,595 వద్ద నిలిచింది. ఒక దశలో 68,033 వరకూ ఎగసిన వెండి తదుపరి రూ. 66,401 వరకూ పతనమైంది.

కామెక్స్‌లోనూ వీక్
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.6 శాతం బలపడి 1,958 డాలర్ల సమీపంలో కదులుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.2 శాతం పుంజుకుని 1,951 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ఔన్స్ 1.3 శాతం పుంజుకుని 27.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు