గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,328 కోట్లు

19 Jul, 2021 01:43 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)లోకి జూన్‌ త్రైమాసికంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. నికరంగా రూ.1,328 కోట్లను గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. కానీ, క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో వచ్చిన రూ.2,040 కోట్లతో పోలిస్తే తగ్గినట్టు.. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గతేడాది భారీగా పెట్టుబడులు రావడం అన్నది అప్పటి అనిశ్చిత పరిస్థితుల వల్లేనని మార్కెట్‌ పల్స్‌ సీఈవో అర్షద్‌ ఫాహోమ్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలోకి కొంత పెట్టుబడులను మళ్లించడమే భారీ పెట్టుబడులకు కారణమని గ్రీన్‌పోర్ట్‌ఫోలియో సహ వ్యవస్థాపకుడు దివమ్‌ శర్మ తెలిపారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) బంగారం ఈటీఎఫ్‌ల్లోకి రూ. 1,779 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
5

మరిన్ని వార్తలు