యూజర్లూ బీ అలర్ట్‌! 2022 మోస్ట్‌ రిస్కీ బ్రౌజర్‌ ఏదో తెలుసా?

8 Oct, 2022 17:37 IST|Sakshi

న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌ వాడుతున్నారా? అయితే మీకొక షాకింగ్‌ న్యూస్‌. 2022లో అత్యంత ప్రమాదకరమైన  ఇంటర్నెట్ బ్రౌజర్‌గా క్రోమ్‌ తేలిందట. అట్లాస్‌ వీపీఎన్‌  తాజా విశ్లేషణ ప్రకారం 10 నెలల వ్యవధిలో గూగుల్ క్రోమ్  అత్యధికంగా  303 సమస్యలను ఎదుర్కొన్నట్లు కనుగొంది. అలాగే లైఫ్‌ టైంలో ఈ బ్రౌజర్ మొత్తం 3,159 వల్నరబులిటీలను ఎదుర్కొందని విశ్లేషించింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు)

గూగుల్ క్రోమ్ తరువాత మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, యాపిల్‌ సఫారీ ఈ కోవలో నిలిచాయి.  డేటా దుర్బలత్వ డేటాబేస్ (VulDB) నుండి వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. జనవరి 1 నుండి అక్టోబర్ 5 వరకు డేటాను  ఇది రివ్యూ చేసింది. పరిశోధన ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు Google Chrome మాత్రమే సమస్యలక గురైంది. ముఖ్యంగా CVE-2022-3318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309,  CVE-2022-3307 ఈ కొత్త భద్రతా సమస్యలు ప్రతీ డివైస్‌ మెమరీని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే బ్రౌజర్‌ వెర్షన్ 106.0.5249.61కి అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని వెల్లడించింది.  2022లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 103 భద్రతా సమస్యలను, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ 117 సమస్యలను  ఎదుర్కొంది. మైక్రోసాప్ట్‌ ఎడ్జ్‌ లాంచ్‌ తరువాత  మొత్తం 806 వల్నరబులిటీస్‌ని ఫేస్‌  చేసింది.  2021 నుండి 62 శాతం పెరుగుదల.

ఇదీ చదవండి:  Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ

ఇటీవల వినియోగదారుల సంఖ్య ఇటీవల ఒక బిలియన్‌ను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ సఫారీ రెండవ స్థానానికి చేరుకుంది. 2022లో, ఈ బ్రౌజర్ అతి తక్కువ సమస్యలొచ్చాయి. ఈ పరిశోధన సమయంలో కేవలం 26 వల్నరబులిటీస్‌ని మాత్రమే ఎదుర్కొంది.  అయితే మొత్తంగా 1,139 దుర్బలత్వాలను ఎదుర్కోవడం  గమనార్హం. చివరగా, మొత్తం లైఫ్‌ టైంలో  344 భద్రతా సమస్యలను ఎదుర్కొన్న ఒపెరా బ్రౌజర్‌కు ఈ కాలంలో ఎలాంటి సమస్యా రాలేదు. అయితే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌,  ఒపెరా బ్రౌజర్‌లు ఒకే Chromium ఇంజిన్‌పై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు  వాటిని ప్రభావితం చేయవచ్చని పరిశోధన వెల్లడించింది.

మరిన్ని వార్తలు