110 సంస్థలకు అనుమతులు

4 Nov, 2023 04:27 IST|Sakshi

కంప్యూటర్ల దిగుమతులకు మంజూరు

న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 110 సంస్థలకు కేంద్రం అనుమతినిచి్చంది. యాపిల్, డెల్, లెనొవొ, హెచ్‌పీ ఇండియా సేల్స్, అసూస్‌ ఇండియా, ఐబీఎం ఇండియా, షావోమీ టెక్నాలజీ ఇండియా, శాంసంగ్‌ ఇండియా ఎల్రక్టానిక్స్‌ మొదలైనవి వీటిలో ఉన్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అనుమతుల కోసం మొత్తం 111 దరఖాస్తులు వచి్చనట్లు వివరించారు.

అయితే, ’నిరాకరణ జాబితా’లో ఉన్న ఒక హైదరాబాద్‌ సంస్థకు మాత్రం అనుమతి లభించలేదని పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్దిష్ట ఐటీ హార్డ్‌వేర్‌ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా అనుమతులకు లోబడి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలి్పంచింది. నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆథరైజేషన్‌ విధానం 2024 సెపె్టంబర్‌ వరకు అమల్లో ఉంటుంది.

అక్టోబర్‌ 31న పరిశ్రమ వర్గాలతో సమావేశమైన డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌) అనుమతుల ప్రక్రియ గురించి వివరించారు. ’నిరాకరణ జాబితా’లో ఉన్న సంస్థలకు అనుమతులు లభించవు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ ఎగుమతి నిబంధనలను పాటించని సంస్థలు, డీఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయి.  ఐటీ హార్డ్‌వేర్‌ సంబంధ దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 8.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 5.33 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు సహా పర్సనల్‌ కంప్యూటర్లు దిగుమతయ్యాయి. అత్యధికంగా చైనా (5.11 బిలియన్‌ డాలర్లు), సింగపూర్‌ (1.4 బిలియన్‌ డాలర్లు), హాంకాంగ్‌ (807 మిలియన్‌ డాలర్లు) నుంచి ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తులు దిగుమతవుతున్నాయి. 

మరిన్ని వార్తలు