అలా చేస్తే.. ఇక పెట్రోల్ అవసరం లేదు: నితిన్ గడ్కరీ

23 Dec, 2021 21:15 IST|Sakshi

వాహనాల్లో ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ ఇంజిన్‌లను ప్రవేశపెట్టాలని కార్ల తయారీదారులకు ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఒక కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగిస్తూ.. ఎలక్ట్రిక్ వాహనలను, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ''నిన్న, నేను ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌లను తయారు చేయమని కార్ల తయారీదారులకు సలహా ఇవ్వడానికి ఒక ఫైల్ పై సంతకం చేశాను. ఈ ఇంజిన్లను కార్ల తయారీదారులు తయారు చేయడానికి ఆరు నెలలు సమయం ఇచ్చాము' అని ఆయన అన్నారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ లేదా ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అనేది గ్యాసోలిన్, మిథనాల్ లేదా ఇథనాల్ కలయికతో తయారు చేసిన ప్రత్యామ్నాయ ఇంధనం. టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ఇప్పటికే తమ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి తెలిపారు. ''త్వరలో, కార్లు కూడా 100 శాతం ఇథనాల్ ఇంధనంతో నడుస్తాయి. కాబట్టి, మాకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. అలాగే గ్రీన్ ఫ్యూయల్ వాడకం వల్ల భారీగా డబ్బు ఆదా అవుతుంది' అని గడ్కరీ అన్నారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఎలా పని చేస్తుంది?
ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ అనేది ఒక అంతర్గత దహన యంత్రం. ఈ ఇంధనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల ఇంధనంతో పని చేయగలదు. సాధారణ భాషలో చెప్పాలంటే ఈ ఇంజిన్‌లో పెట్రోల్, ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ మిక్సర్‌లోని ఇంధన పరిమాణానికి అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే ఫ్యూయల్ మిక్సర్ సెన్సార్‌ లాగా పనిచేస్తుంది. ఫ్యూయల్ కంపోజిషన్ సెన్సార్, ఈసీయు ప్రోగ్రామింగ్ వంటి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, ఇంజిన్ పరిమాణాన్ని సెట్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు.

(చదవండి: క్యాబ్ యూజర్ల కష్టాలకు చెక్.. సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చిన ఓలా!)

మరిన్ని వార్తలు