టెస్లాకి షాకిస్తున్న హ్యుందాయ్‌

18 Feb, 2021 13:01 IST|Sakshi

 హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఐకానిక్‌ కార్ టీజర్ 

ఐయోనిక్ 5..టెస్లాకి షాక్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు దేశంలో ఎలక్ట్రిక్  వాహనాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో ఈ-వెహికల్స్‌కు పెట్టింది పేరైన  అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ దేశంలో ఎంట్రీ  ఇచ్చేందుకు సిద్ధ మౌతోంది. మరోవైపు హ్యుండాయ్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఐయోనిక్ 5 టీజర్‌ను విడుదల చేసింది. సూపర్బ్‌ లుక్‌, అత్యాధునిక ఫీచర్లతో టెస్లాకు షాక్‌ ఇవ్వనుందంటూ ఈ టీజర్‌పై చర్చ టెక్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. భారీ డిజిటల్ స్క్రీన్‌ సహా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు  ఎల్‌ఇడి యాంబియంట్ లైటింగ్ లాంటి అల్ట్రా-మోడరన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించింది. ఐయోనిక్ 5లో యూనివర్సల్ ఐలాండ్  కన్సోల్‌ ద్వారా ముందు, వెనుక సీట్లను ముందుక వెనుకకు మూవ్‌ కావడం విశేషంగా నిలుస్తోంది.దీని సహాయంతో  డ్రైవర్ , ప్రయాణీకులు ఇద్దరూ ఇరువైపుల నుండి వాహనంలోకి  ప్రవేశించడానికి లేదా నిష్క్రమించే సౌలభ్యం ఉంటుందనీ హ్యుందాయ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 

ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై లివింగ్ స్పేస్ థీమ్‌తో మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. ఈ టీజర్‌పై  ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఫిబ్రవరి 23న వరల్డ్ ప్రీమియర్ షోకి రెడీ అవుతున్న  తరుణంలో హ్యుందాయ్‌ దీన్ని విడుదల చేసింది. గత నెలలోనే హ్యుందాయ్ ఐయోనిక్ 5 ని రిలీజ్ చేసిన సందర్భంలోనే కొత్త వెర్షన్ ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఐయోనిక్ 5 ఇంటీరియర్‌లో వాడిన మెటీరియల్ కూడా ఎకో ప్రాసెస్డ్ లెదర్‌ను వినియోగించింది. అలాగే కారు మొత్తం సహజసిద్దమైన పెయింట్, రీసైకిల్డ్ ఫైబర్ వాడారు. సీట్లను కవర్ చేసే ఈ ఎకో లెదర్‌కి తోడు అవిసెగింజల నూనె నుంచి తీసిన డైలతో పెయింట్ వేసినట్లు కంపెనీ ప్రకటించింది.  కారులోని క్యాబిన్‌లో కూడా ఊలు, పాలీయార్న్‌ కూడా చెరకు నుంచి ఉత్పన్నమైన ఫైబర్‌ను వినియోగించింది. అంతేకాదు పర్యావరణ హితంగా పెట్ బాటిల్స్..వాటినుంచి ఫైబర్ చేసి ఐకానిక్ 5‌కి వాడిందట. ఫ్లోర్ మాట్స్, కారు డ్యాష్ బోర్డ్, స్విచ్చులు, స్టీరింగ్ వీల్, డోర్ ప్యానెల్స్ జొన్న,తదితర పూల నుంచి తీసిన బయో కాంపొనెంట్స్‌తో కోటింగ్ ఇవ్వడం మరో హైలైట్. ఇదంతా పర్యావరణానికి సంబంధించిన కోణమైతే, కారులోపల డ్రైవర్‌తో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చునేవారు హాయిగా రిలాక్స్ అవడానికి లెగ్ రెస్ట్  సదుపాయాన్ని జోడింది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పూర్తయ్యేవరకూ ఈ ఇద్దరూ హ్యాపీగా రిలాక్స్ అయ్యేలా డిజైన్‌ చేసింది. పెద్దలు, పిల్లలు, వెనుక కూర్చున్న పెంపుడు జంతువుల కోసం కూడా సీట్ల అరేంజ్‌మెంట్ కూడా మనకి అవసరమైనట్లుగా రీపొజిషన్ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు