తగ్గేదెలే అంటున్న మస్క్‌, టెక్‌ దిగ్గజాలకే సవాల్‌!

26 Nov, 2022 17:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌ కొత్త బాస్‌, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ తగ్గేదేలా అంటున్నారు. టెక్‌ దిగ్గజాలు యాపిల్‌, గూగుల్‌ తన ట్విటర్‌ యాప్‌ను తమ యాప్‌స్టోర్‌నుంచి తొలగిస్తే తాను ఏం చేయనున్నారో తెగేసి చెప్పేశారు. ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌, టెస్లా కంపెనీలతో దూసుకుపోతున్న మస్క్‌   స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  (ట్విటర్‌ బ్లూటిక్‌ ఒక్కటే కాదు! ఎవరెవరికి ఏ కలర్‌ అంటే?)

యాపిల్‌ గూగుల్ తమ తమ యాప్ స్టోర్‌ల నుండి ట్విటర్‌ను బూట్ చేయాలని నిర్ణయించుకుంటే తాను కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించ డానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఇటీవలి ట్విటర్ థ్రెడ్‌లో దీనికి సంబంధించిన సాదక బాధకాలపై చర్చిస్తూ, మస్క్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కంటెంట్ నియంత్రణ సమస్యలపై యాపిల్‌, గూగుల్ యాప్ స్టోర్‌ ట్విటర్‌ను నిషేధించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ట్విటర్‌  యూజర్ అడిగిన ప్రశ్నకు బదులుగా మస్క్ ఇలా స్పందించారు. అయితే ఆ పరిస్థితి వస్తుందని తాను కచ్చితంగా భావించడం లేదు..వేరే  మార్గంలేకపోతే ప్రత్యామ్నాయ  స్మార్ట్‌ఫోన్ల తయారీ రంగంలోని ప్రవేశిస్తానన్నారు.

మరోవైపు  మస్క్ వ్యాఖ్యలకు నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పీ  కూడా స్పందించారు.  మస్క్‌ ఏం చేస్తాడో చూడాలని చాలా ఆత్రుతగా ఉన్నానంటూ ట్వీట్‌ చేశారు. కాగా  ట్విటర్‌ను మస్క్‌ టేకోవర్‌ చేసిన తరువాత బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌  ప్రకటించారు. మూడు రంగుల్లో వర్గాల వారీగా చెక్‌ మార్క్‌ కలర్‌ను మస్క్‌ ఇటీవల ప్రకటించారు. ఈ వెరిఫికేషన్ కోసం యూజర్ల నుంచి 8 డాలర్లు వసూలు చేసేప్రక్రియను టెంటటివ్‌గా డిసెంబరు 2 నుంచి అమలు చేయ నున్నట్టుగా మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు