దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్‌లో 86 అంగుళాల టీవీల అసెంబ్లింగ్‌

4 Oct, 2022 11:36 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో తొలిసారిగా 86 అంగుళాల టీవీల అసెంబ్లింగ్‌ను హైదరాబాద్‌కు చెందిన రేడియంట్‌ అప్లయాన్సెస్, ఎలక్ట్రానిక్స్‌ ప్రారంభించింది. ఇందుకో సం నూతన అసెంబ్లింగ్‌ లైన్‌ను ఇక్కడి ఫ్యాబ్‌ సిటీలో కంపెనీకి చెందిన ప్లాంటులో ఏర్పాటు చేసింది.

లాయిడ్‌ బ్రాండ్‌ కోసం 75 అంగుళాల గూగుల్‌ టీవీ తయారీని ప్రారంభించినట్టు రేడియంట్‌ అప్లయాన్సెస్‌ ఎండీ రమీందర్‌ సింగ్‌ సోయిన్‌ ఈ సందర్భంగా తెలిపారు. రిసోల్యూ ట్‌ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ఎలక్ట్రానిక్స్‌ తయారీలో 25 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. అంతర్జాతీయ బ్రాండ్లకు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను తయారు చేసి సరఫరా చేస్తోంది.    

మరిన్ని వార్తలు