అయిదు ఐపీవోలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

30 Nov, 2023 04:44 IST|Sakshi

లిస్టులో ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్, డోమ్స్‌ తదితర సంస్థలు

న్యూఢిల్లీ: అఫోర్డబుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ తదితర అయిదు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. జనా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, శివ ఫార్మాకెమ్, ఒనెస్ట్‌ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటికి నవంబర్‌ 7–16 మధ్య సెబీ అబ్జర్వేషన్‌ లెటర్స్‌ (ఓఎల్‌) జారీ చేసింది. ఐపీవోకి సెబీ ఆమోదముద్రగా ఓఎల్‌ను పరిగణిస్తారు. ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ రూ. 1,800 కోట్లు సమీకరించనుంది.

డోమ్స్‌ కొత్తగా రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు రూ. 850 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జనా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రూ. 575 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు, 40,51,516 షేర్లను విక్రయించనున్నారు. శివ ఫార్మాకెమ్‌ ఐపీవో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు రూ. 900 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్ర యించనున్నారు. ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఒనెస్ట్‌ రూ. 77 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ఇతర వాటాదా రులు 32.5 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. 

మరిన్ని వార్తలు