పబ్లిక్‌ ఆఫర్‌.. బంపర్‌ హిట్‌!

25 Nov, 2023 05:07 IST|Sakshi

టాటా టెక్‌ @ 69 రెట్లు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సరీ్వసుల కంపెనీ  కి భారీ స్పందన లభించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో చివరి రోజు శుక్రవారానికల్లా 69 రెట్లుపైగా అధిక సబ్ర్‌స్కిప్షన్‌ లభించింది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్‌ చేయగా.. 312 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 203 రెట్లు బిడ్స్‌ దాఖలుకాగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 62 రెట్లు, రిటైలర్ల నుంచి 17 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. టీసీఎస్‌ (2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లు అందుకుంది.

ఫ్లెయిర్‌ రైటింగ్‌..@47 రెట్లు
పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల కంపెనీ ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవో చివరి రోజు శుక్రవారానికల్లా 47 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను సాధించింది. కంపెనీ 1,44,13,188 షేర్లను ఆఫర్‌ చేయగా.. 67 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి.  క్విబ్‌ విభాగంలో 116 రెట్లు అధిక బిడ్స్‌ నమోదుకాగా, రిటైలర్ల నుంచి 13 రెట్లు బిడ్స్‌ దాఖలయ్యాయి.

ఫెడ్‌ఫినా@ 22 రెట్లు
ఫెడరల్‌ బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఫెడ్‌ఫినా) ఐపీవోకు మంచి స్పందన లభించింది. 5.59 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 12 కోట్లకుపైగా షేర్లకు (2.2 రెట్లు) బిడ్స్‌ వచ్చాయి. క్విబ్‌ విభాగంలో 3.5 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.5 రెట్లు, రిటైలర్ల నుంచి 1.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి.

గాంధార్‌ ఆయిల్‌ @ 64 రెట్లు
ప్రైవేట్‌ రంగ కంపెనీ గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ (ఇండియా) ఐపీవో చివరి రోజు శుక్రవారానికల్లా 64 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను సాధించింది. కంపెనీ 2,12,43,940 షేర్లను ఆఫర్‌ చేయగా.. 136 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (క్విబ్‌) విభాగంలో 129 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 62 రెట్లు, రిటైలర్ల నుంచి 29 రెట్లు చొప్పున బిడ్స్‌ దాఖలయ్యాయి. దీంతో షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 501 కోట్ల మేర నిధులను సమీకరించింది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది.

  ఈ నాలుగు ఇష్యూలకూ గురువారాని (30)కల్లా షేర్ల కేటాయింపు జరిగే వీలుంది. రిఫండ్స్‌ శుక్రవారం, షేర్లు సోమవారం (4న) రావచ్చు. వచ్చే నెల 5న స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో
లిస్ట్‌కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు