తగ్గేదేలే.. బ్రెజిల్‌లో రికార్డు సృష్టించిన భారత కంపెనీ, 48 గంటల్లోనే..

23 Nov, 2022 08:32 IST|Sakshi

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కూ యాప్‌ బ్రెజిల్‌లో రికార్డు సృష్టించింది. అక్కడి మార్కెట్లో ఆవిష్కరించిన 48 గంటల్లో 10 లక్షలకుపైగా డౌన్‌లోడ్స్‌ నమోదు చేసింది. ప్రస్తుతం 11 భాషల్లో కూ యాప్‌ అందుబాటులో ఉంది. మరిన్ని దేశాల్లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో ముమ్మరం చేస్తున్నారు.  కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. “ప్రపంచంలో కేవలం 20% మంది ఇంగ్లీష్ మాట్లాడతారు.

ప్రపంచంలోని 80% మంది తమ దేశానికి చెందిన భాషను మాట్లాడుతున్నారు. చాలా గ్లోబల్ ప్రోడక్ట్‌లు వివిధ భాషలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రారంభించినప్పటి నుంచి ఒక్క బ్రెజిల్‌ యూజర్ల నుంచి Koo ఇటీవల 2 మిలియన్ కూస్ (లేదా పోస్ట్‌లు), 48 గంటల్లో 10 మిలియన్ లైకులను సంపాదించిందని తెలిపారు.

ఇదిలా ఉండగా ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ సంస్థలో గందరగోళం పరిస్థితి నెలకొంది. రోజుకో అంశం తెరపైకి వచ్చి రచ్చ చేస్తోంది. అంతేకాకుండా బ్లూ టిక్‌ వివాదం నెట్టింట దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో యూజర్లు ట్విటర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ట్విటర్‌, మెటా ఉద్యోగుల తొలగింపు.. రండి మీకు నేను ఉద్యోగాలిస్తా.. రతన్‌ టాటా బంపరాఫర్‌!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు