IT Companies Contract Staff: ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు!

17 May, 2022 16:16 IST|Sakshi

కరోనా మహమ్మారికి కారణంగా టెక్నాలజీ వినియోగం పెరిగింది.దీంతో ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సైతం డిమాండ్‌ ఏర్పడింది. అయితే తమకు అర్హులైన ఉద్యోగుల్ని ఎంపిక చేయడం టెక్‌ సంస్థలకు కత్తిమీద సాములాగా తయారైంది. అందుకే వేలకోట్లు ఖర్చు చేసి మరీ స్టాఫింగ్‌ ఏజెన్సీల సాయంతో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. మార్కెట్‌లో ఉన్న డిజిటల్‌ స్కిల్‌ కొరతను అధికమిస్తున్నాయి. దీంతో టెక్‌ మార్కెట్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 
  

ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ టెక్‌ కంపెనీలు స్టాఫింగ్‌ ఏజెన్సీల సాయంతో ఉద్యోగల్ని (సబ్‌ కాంట్రాక్టర్స్‌ను) నియమించుకుంటున్నాయి. స్టాఫింగ్‌ ఏజెన్సీలు సైతం వాళ్ల పద్దతిలో సెలక్ట్‌ చేసుకున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శాలరీ, ఇన్స్యూరెన్స్‌ కవరేజ్‌తో పాటు ఇతర బెన్ఫిట్స్‌ను అందిస్తున్నాయి. 

అయితే ఈ తరహా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెసీఎల్‌'లు పోటీ పడుతున‍్నాయి. అందుకోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. సాధారణ ఉద్యోగుల నియామకానికి సమానంగా కాంట్రాక్ట్‌ పద్దతిలో ఉద్యోగుల్ని రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. ఇలా ఈఏడాది ఫైనాన్షియల్‌ ఇయర్‌లో టీసీఎస్‌ 34.2శాతం వృద్ధితో కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై రూ.16,975కోట్లు ఖర్చు చేస్తుండగా ఇన్ఫోసిస్‌ 77.9శాతం వృద్ధితో రూ.12,607కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో విప్రో 30శాతం వృద్ధితో రూ.10,858 కోట్లు ఖర్చు చేయగా..23శాతం వృద్ధితో హెచ్‌సీఎల్‌ ఖర్చు చేసినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

పర్మినెంట్‌ చేస్తున్నాయి
సంస్థలు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని నియమించుకోవడం వల్ల డిమాండ్‌కు అవసరమయ్యే డిజిటల్‌ స్కిల్స్‌ను ఉపయోగించుకోవడంతో పాటు, స్కిలున్న ఉద్యోగుల్ని గుర్తించడం స్టాఫింగ్‌ ఏజెన్సీలకు సులభం అవుతుంది.తద్వారా సంస్థకు వస్తున్న ప్రాజెక్ట్‌లను తక్కువ సమయంలో పూర్తి చేయడం, ఐటీ సంస్థల్ని కుదిపేస్తున్న అట్రిషన్‌ రేట్‌ను తగ్గించుకునేందుకు సంస్థలు ట్రై-బై-అప్రోచ్‌ పద్దతిని అవలంభిస్తున్నాయని టెక్‌ అడ్వైజరీ సంస్థ క్యాటలిన్క్స్ పార్టనర్  రామ్‌ కుమార్‌ రామ మూర్తి తెలిపారు. ట్రై-బై-అప్రోచ్‌ పద్దతి అంటే కాంట్రాక్ట్‌ పద్దతిలో ఉద్యోగులు నియమించుకొని ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్నాయి. అవసరం అనుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని సంస్థలు సాధారణ ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాయి. 

చదవండి👉సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు బంపరాఫర్‌, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోండి!

మరిన్ని వార్తలు