ఇదీ ఇండియన్స్‌ సత్తా! ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌

19 Aug, 2023 19:49 IST|Sakshi

Anand Mahindra Tweet: సోషల్‌ మీడియాలో చరుగ్గా ఉండే మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. అధిక సంఖ్యలో ఉండే తన ఫాలోవర్లకు ఆయా అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా విదేశాల్లో భారతీయుల అభ్యున్నతికి సంబంధించిన అంశంపై స్పందించారు.

అమెరికాలో బిలియన్‌ డాలర్ల కంపెనీలను స్థాపించిన విదేశీ వ్యక్తుల్లో భారతీయులే టాప్‌ లో ఉన్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను ‘వల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌’ ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేయగా దాన్ని ట్యాగ్‌ చేస్తూ ‘ఆశ్చర్యపరిచే గణాంకాలు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తున్న దేశాలకు ఎంత చేస్తున్నారో.. ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఒక బిలియన్‌ డాలర్‌ అంత కంటే ఎక్కువ విలువైన అమెరికన్‌ కంపెనీలలో సగానికిపైగా విదేశాల్లో జన్మించి ఆ దేశానికి వలస వచ్చినవారే. వీరిలో భారత్‌ నుంచి వలస వెళ్లినవారే అత్యధికులు. విదేశీ వలసదారులు స్థాపించిన మొత్తం అమెరికన్‌ కంపెనీల్లో అత్యధికంగా భారతీయులు 66 కంపెనీలను స్థాపించారు. 54 కంపెనీలతో ఇజ్రాయిల్‌, 27 కంపెనీలతో యూకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు