Instagram Down: అసలు ఏమైంది? యూజర్ల గగ్గోలు, మీమ్స్‌ వైరల్‌

1 Nov, 2022 12:27 IST|Sakshi

సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడం యూజర్లలో గందర గోళానికి తీసింది. తాజాగా మెటా సొంతమైన ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయిందంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. ఇన్‌స్టాలో సమస్యలను ఎదుర్కొంటున్న పలువురు యూజర్లు సోషల్‌ మీడియాలో సోమవారం ఫిర్యాదు చేశారు.  తమ ఖాతాలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు  ఒక అలర్ట్‌  మెసేజ్‌ వచ్చినట్టు వినియోగదారులు  వాపోయారు.

వినియోగదారులు తమ ఖాతాలకు తిరిగి లాగిన్ చేయడంలో సమస్యలు, అకౌంట్‌  సస్పెండ్  స్క్రీన్‌షాట్లతో ఫిర్యాదులు ట్విటర్లో వెల్లువెత్తాయి. తమ ప్రొఫైల్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నామని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయినట్టు కనిపిస్తోంది లేదంటే..నాఅకౌంట్‌ బ్లాక​ అయిందా అంటూ ఒక వినియోగదారు సోమవారం ట్వీట్ చేశారు. ఏకంగా తమ ఖాతా  30 రోజుల పాటు సస్పెండ్  అనే మెసేజ్‌తోపాటు శాశ్వతంగా నిలిపివేసే ప్రమాదం ఉందనే అలర్ట్‌ వచ్చిందంటూ ఆందోళనకు  గురయ్యారు. అంతేకాదు తమ ఫాలోవర్ల సంఖ్య కూడా పడిపోయిందని తెలిపారు. 

దీంతో ఈ వార్త ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు  కోరుతున్నామని ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించింది. 

మరిన్ని వార్తలు