‘వెపా’ ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్‌ ఇండియా ఎన్నిక

23 Oct, 2021 06:03 IST|Sakshi

న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలకు సంబంధించిన వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీస్‌ (వైపా) ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్‌ ఇండియా ఏకగ్రీవంగా ఎన్నికైంది. భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2021–23 కాలానికి వైపా స్టీరింగ్‌ కమిటీలో ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్‌ ఇండియా ఉండనుండగా, ఈజిప్ట్‌.. స్విట్జర్లాండ్‌ వైస్‌–ప్రెసిడెంట్లుగా వ్యవహరించనున్నాయి. బ్రెజిల్, దక్షిణ కొరియా మొదలైన తొమ్మిది దేశాలు ప్రాంతీయ డైరెక్టర్లుగా ఉంటాయి.

స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే వైపా మండలిలో ఐక్యారాజ్య సమితికి చెందిన వివిధ సంస్థలు, వరల్డ్‌ బ్యాంక్‌ మొదలైన వాటికి సభ్యత్వం ఉంది.  భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక, సమన్వయ ఏజెన్సీగా ఇన్వెస్ట్‌ ఇండియా ఏర్పాటైంది. వ్యాపారాలను స్వాగతించేందుకు పలు కీలకమైన ఆర్థిక సంస్కరణల అమలుకు భారత్‌ నిరంతరం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. దీనితో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కలి్పంచేందుకు అవకాశమున్న 155 బిలియన్‌ డాలర్ల పైగా సూచనప్రాయ పెట్టుబడులకు ఇన్వెస్ట్‌ ఇండియా సమన్వయకర్తగా వ్యవహరిస్తోందని వివరించారు. 

మరిన్ని వార్తలు