ప్రపంచంలో బెస్ట్ డిస్‌ప్లే ఫోన్ ఇదే

22 Nov, 2020 10:07 IST|Sakshi

ఐఫోన్ 12 ప్రో మాక్స్ డిస్ ప్లే మేట్ యొక్క పరీక్షలో A + గ్రేడ్‌ను పొందింది. ఈ ఫోన్ యొక్క సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్ ప్లే, మొత్తంగా 11 స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే రికార్డులను బద్దలు కొట్టింది. వీటిలో సంపూర్ణ రంగు విషయంలో అత్యధిక ఖచ్చితత్వం, అత్యధిక కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. గత ఐఫోన్ మోడల్స్ సాధారణంగా అధిక-పనితీరు గల డిస్ ప్లేలను కలిగి ఉన్నాయి. కానీ ఈ ఐఫోన్ 12 ప్రో మాక్స్ 6.7 - అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లేతో 2,778x1,284 పిక్సెల్స్ రిజల్యూషన్, 458పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. (చదవండి: ఎయిర్‌టెల్: రూ.19కే అన్‌లిమిటెడ్ కాల్స్)  

డిస్ ప్లే మేట్ అనేది ఒక ఫోన్ యొక్క డిస్ ప్లే అనేది ఎంత భాగా పని చేస్తుందో పరిక్షించి తెలియజేసే సంస్థ ఇది. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌కు ఈ పరీక్షలో అత్యధిక రేటింగ్ అయిన ఏ+ గ్రేడ్‌ను అందించారు. ఓఎల్ఈడీ స్మార్ట్ ఫోన్లలో అత్యధిక బ్రైట్‌నెస్‌ను కూడా ఈ ఫోన్ రికార్డు చేసింది. యాపిల్ గతంలో లాంచ్ చేసిన ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ 9 డిస్ ప్లే రికార్డులను బద్దలు కొట్టగా, అంతకు ముందు వచ్చిన ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ఎనిమిది రికార్డులను బద్దలు కొట్టింది. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్  ప్రారంభ వేరియంట్ అయిన 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,29,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,900గానూ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,900గానూ నిర్ణయించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా