iPhone: ఐఫోన్‌లో కొత్త బగ్‌..! ఇలా పరిష్కరించండి...

5 Jul, 2021 20:57 IST|Sakshi

ఆపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్‌ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే ఆపిల్‌ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్‌ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అప్పుడప్పుడు ఐఫోన్లు బగ్‌లకు గురైతే వెంటనే వాటికి ఆపిల్‌ పరిష్కారం చూపుతుంది. తాజాగా ఆపిల్‌ ఐఫోన్‌లో మరొక బగ్‌ను గుర్తించారు. ఈ బగ్‌ ఆపిల్‌ ఫోన్లలో వైఫై సపోర్ట్‌ను పూర్తిగా నిలివివేస్తోంది. 

‘%secretclub%power’ అనే పేరుతో ఉన్న వైఫై నెట్‌వర్క్‌ కు ఐఫోన్‌ను కనెక్ట్ చేసినప్పుడు వైఫై ఆటోమెటిగ్గా డిసేబుల్ అవుతుందని కార్ల్ షౌ అనే బ్లాగర్‌ ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు. అతను % సింబల్‌ ఉన్న వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ కావడంతో అతని ఐఫోన్‌లో వైఫై పూర్తిగా డిసేబుల్ అయ్యిందని తెలిపాడు. నెట్‌వర్క్‌ సెట్టింగ్‌లను రిసెట్‌, ఫోన్‌ను రీస్టాట్‌ చేసిన తిరిగి వైఫై సౌకర్యాన్ని పొం‍దలేకపోయాడు.  

ఇలా చేస్తే..బెటర్‌..
ఆపిల్‌ ఐఫోన్లలో ఎదురవుతున్న  ఈ సమస్యను పరిష్కరించడానికి కొంతమంది టెక్‌ నిపుణులు  రెండు మార్గాలను సూచించారు. వైఫై సెట్టింగ్స్‌ను రీసెట్ చేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చునని పేర్కొన్నారు. ఐక్లౌడ్ నుంచి వైఫై నెట్‌వర్క్ పేరును తొలగించడం ద్వారా తిరిగి వైఫై సౌకర్యాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు.  ఈ బగ్‌పై ఆపిల్ అధికారికంగా స్పందించ లేదు.

మరిన్ని వార్తలు