Facebook: మరో ముప్పు,ఫేస్‌బుక్‌ కు 36 మిలియన‍్ల యూరోల ఫైన్‌

14 Oct, 2021 15:34 IST|Sakshi

ఫేస్‌ బుక్‌ అధినేత మార్క్‌ జూకర్‌ బెర్గ్‌ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారిపోతుంది. 'భద్రత కంటే లాభాలే ముఖ్యం' అనే మచ్చ జూకర్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హాగెన్‌ చేసిన ఆరోపణలు, వెలుగులోకి తెచ్చి ఆధారాలు ఆయన్ను మరింత అష్ట దిగ్భందనం చేస్తున్నాయి.'ఐ కాంట్‌ బ్రీత్‌' అనే తరహాలో అవి చాలవన్నట్లు తాజాగా ఐర్లాండ్‌ డేటా ప్రొటెకమిషన్‌ భారీ జరిమానా విధించింది.

యూరోపియన్‌ కమిషన్‌ ప్రకారం.. 


అండర్‌ యురేపియన్‌ యూనియన్‌ - 2018 డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ప్రకారం..ఫేస్‌బుక్‌పై ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ అధికారులు 36 మిలియన‍్ల యూరోల (ఇండియన్‌ కరెన్సీలో రూ.3,14,62,56,000.00) ఫైన్‌ విధించారు. యూరోపియన్‌ కమిషన్‌ ప్రకారం.. మొత్తం 44 యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో  బిజినెస్‌ వ్యవహారాల్ని సులభతరం చేసేందుకు 'వన్‌ స్టాప్‌ షాప్‌'తో ఓ యూనియన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. యూరోపియన్‌ దేశాల్లో బిజినెస్‌ వ్యవహరాలు నిర్వహించాలంటే ఆ కమిషన్‌ సభ్యులు చెప్పినట్లుగా వ్యవహరించాలి. లేదంటే కఠిన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా వన్‌ స్టాప్‌ షాప్‌ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌పై ఐర్లాండ్‌ కమిషన్‌ చర్యలకు ఉపక్రమించింది.

ఆస్ట్రియన్‌ యాక్టివిస్ట్‌ 


ఆస్ట్రియాకు చెందిన ప‍్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త  మాక్స్ స్క్రెమ్స్ ఫేస్‌బుక్‌ ప్రైవసీ వయోలేషన్‌ పై ఫైట్‌ చేస్తున్నారు. తాజాగా ఈయన ఫేస్‌బుక్‌పై డజన‍్ల కొద్ది  ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన డీపీసీ సభ్యులు ఫేస్‌బుక్‌ పై 28 మిలియన్ల యూరోల నుంచి 36 మిలియన్ల యూరోల వరకు జరిమానా విధించారు. మరి ఈ ఫైన్‌తో పాటు ఫేస్‌బుక్‌పై పడిన ఆరోపణలనే తుపాన్లను, సునామీలను తట్టుకొని ఏటికి ఎదురీది తన సంస్థను కాపాడుకుంటారో లేదంటే ఇంకేం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. 

చదవండి: 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్‌ బుక్‌ను ముంచే విధ్వంసం

మరిన్ని వార్తలు