సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు

14 Oct, 2021 15:49 IST|Sakshi

టాటా మోటార్స్ తన కొత్త మైక్రో ఎస్‌యువి టాటా పంచ్ కారును ఇటీవల భారతీయ మార్కెట్లో ఆవిష్కరించన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్‌సీఏపీ కొత్త టాటా పంచ్ ఎస్‌యువి సేఫ్టీ రేటింగ్ పరంగా 5-స్టార్ రేటింగ్ పొందినట్లు తెలిపింది. అలాగే, పిల్లల రక్షణ విషయానికి వస్తే 4 స్టార్ రేటింగ్ పొందినట్లు పేర్కొంది. కంపెనీ ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. టాటా మోటార్స్ ఇప్పటికే తన టాటా నెక్సాన్, హారియర్, సఫారీ, ఆల్ట్రోజ్‌ కూడా సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందాయి.(చదవండి: ఫేస్‌బుక్‌కు మరో ముప్పు..జూకర్‌ ఏం చేస్తారో?)

డిసెంబర్ 2018లో నెక్సాన్, జనవరి 2020లో ఆల్ట్రోజ్ తర్వాత ఈ రేటింగ్ అందుకున్న టాటా మోటార్స్ మూడో కారు ఈ పంచ్. అంతే కాకుండా కంపెనీ టిగోర్, టియాగో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందాయి. ఈ కొత్త మైక్రో ఎస్‌యువి ధరను అక్టోబర్ 18న జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. టాటా మోటార్స్ ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ (ఆల్ఫా) ఆర్కిటెక్చర్ పై టాటా పంచ్ నిర్మించారు. ఇది చూడాటానికి టాటా ఆల్ట్రోజ్ లాగా కనిపిస్తుంది. ఈ పంచ్ అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది. దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను డైనా-ప్రో టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 85 బిహెచ్‌పీ పవర్, 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ తో వస్తుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు