భారత్‌లో తొలి కియా ఎలక్ట్రిక్‌ కార్‌, స్టైలిష్‌ లుక్‌తో రెడీ ఫర్‌ రైడ్‌!

14 Apr, 2022 18:23 IST|Sakshi

కియా మోటార్స్‌కు చెందిన తొలి ఎలక్ట్రిక్‌ కార్‌ భారత్‌ మార్కెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. ఇప్పటికే కియా ఎంయూవీ, కియా కార్నివాల్‌ పాటు కాంపక్ట్‌ ఎస్‌యూవీ, సోనెట్‌ వెహికల్స్‌ కొనుగోలు దారుల్ని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తొలి ఎలక్ట్రిక్‌ కారును భారత్‌లో తయారు చేసింది. తాజాగా కారు టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించగా..ఎలక్ట్రిక్‌ కార్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. 
 
కియా ఈవీ6 పేరుతో విడుదల కానున్న ఎలక్ట్రిక్‌ కార్‌ బాడీ స్టైల్‌ హ్యాచ్‌ బ్యాక్‌తో వస్తుండగా..స్టైలింగ్‌లో ఎస్‌యూవీని పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో క్లామ్‌షెల్ బానెట్, స్లిమ్ గ్రిల్స్‌ ఉన్నాయి. కార్‌ వెనుక లైట్ బార్ టెయిల్ లైట్లు,పెద్ద అల్లాయ్ రిమ్‌లు, రేక్డ్ ఫ్లోటింగ్ రూఫ్‌లైన్, వీల్ ఆర్చ్‌ల బాడీ క్లాడింగ్‌తో క్రాస్ఓవర్ డిజైన్‌ లుక్స్‌  అదరగొట్టేస్తున్నాయి. ఈ కారు 4695 ఎంఎం పొడవు, 1890ఎంఎం వెడల్పు,1545 ఎంఎం ఎత్తుతో  వీల్‌బేస్ 2900 ఎంఎంగా ఉంటుంది. 

ఐదు వేరియంట్లు.. 
కియా మొత్తం ఐదు వేరియంట్లలో ఈవీ6ని అందిస్తోంది. మొదటిది 58 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్ తో వస్తుండగా..వెనుక చక్రాలకు 170హెచ్‌పీ (హార్స్‌పవర్‌)తో సపోర్ట్‌ చేస్తుంది. అదే బ్యాటరీ ప్యాక్ నాలుగు చక్రాలకు 235హెచ్‌పిని పంపే డ్యూయల్ మోటార్ సెటప్‌కు ఉపయోగించవచ్చు. అందుకోసం అదనంగా పెద్ద 77.4 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్ ఉంది. 

ఈ పవర్ ప్యాక్ 229హెచ్‌పీ ఉత్పత్తి చేసే ఆర్‌డబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌లో లేదా 325 హార్స్‌ పవర్‌ ను ఉత్పత్తి చేసే డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌లో ఒకే మోటారుకు జత చేయబడుతుంది. చివరగా,జీటీ వేరియంట్ రెండు మోటార్లతో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. దాని ఏడబ్ల్యూడీ వేరియంట్‌లో గరిష్టంగా 585హార్స్‌ పవర్‌, 740 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.  

ఛార్జింగ్ విషయానికొస్తే..
ఛార్జింగ్ విషయానికొస్తే, ఈవీ6 800 వోల్ట్ వేగవంతమైన ఛార్జింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ చేయడానికి సపోర్ట్‌ చేస్తుంది. వాస్తవానికి, ఇది 11 గంటల్లో పూర్తి ఛార్జింగ్‌ ఎక్కేలా 7కేడబ్ల్యూ ఛార్జింగ్ సిస్టమ్‌తో వస్తుంది.

ఇక కారు లోపల డిజైన్‌ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. పనోరమిక్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో స్లిమ్ డ్యాష్‌బోర్డ్, స్క్రీన్‌లో రెండు డిస్‌ప్లేలు,ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డ్రైవర్ వైపు కొద్దిగా పివోట్ చేయబడింది. మరొకటి స్టీరింగ్ వీల్ వెనుక ఉంటుంది. స్టీరింగ్ వీల్ టూ స్పోక్ డిజైన్. ఇది మీరు సాధారణంగా టాప్ ఎండ్ కారులో చూసే అన్ని బటన్‌లను కలిగి ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్ బటన్‌లు, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కింద డిజైన్‌ చేశారు. సెంటర్ కన్సోల్ గేర్ సెలెక్టర్‌గా పనిచేసే రోటరీ నాబ్, స్టార్ట్/స్టాప్ బటన్‌ను కలిగి ఉంటుంది.  

ఇది సంవత్సరంలో విడుదలయ్యే ఈ కారు ధర దాదాపు రూ. 60 లక్షలగా ఉంది. అయితే ఇటీవలే ప్రారంభించబడిన వోల్వో ఎక్స్‌సీ 40 రీఛార్జ్‌కు మినహా కియా ఈవీ6 పోటీ పెద్దగా లేదు. అయితే, హ్యుందాయ్ తన ఐనోకి5 దేశీయ మార్కెట్‌లో విడుదల తర్వాత కియా తొలి ఎలక్ట్రిక్‌ కారుకు పోటీ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది.

చదవండి: అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కొత్త ఎలక్ట్రిక్‌ కార్‌..రేంజ్‌ దుమ్ము దులిపేస్తుంది!

మరిన్ని వార్తలు