మళ్ళీ మారిన ట్విటర్ లోగో.. ఎలాన్ మస్క్ ప్లానా? లేక అజ్ఞాత వ్యక్తి కోరికా?

7 Apr, 2023 18:17 IST|Sakshi

ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫారం ట్విటర్ సీఈఓ 'ఎలాన్ మస్క్' గత సోమవారం ట్విటర్ లోగో బ్లూ బర్డ్ స్థానంలో క్రిప్టో కాయిన్ 'డోజ్ కాయిన్' మార్చిన విషయం అందరికి తెలిసిందే. ట్విటర్ లోగో స్థానాన్ని కైవసం చేసుకున్న డోజ్ కాయిన్ ధర ఒక్క రోజులోనే ఏకంగా 30 శాతం పెరిగిపోయింది. అయితే మళ్ళీ డోజ్ కాయిన్ లోగో స్థానంలో 'బ్లూ బర్డ్'ని చేర్చారు. దీనితో డోజ్ కాయిన్ ధర 9 శాతం క్షిణించింది.

ఎలాన్ మస్క్ చాలా కాలంగా డోజ్ కాయిన్‌కు మద్దతుదారుగా ఉన్నారు, ఇందులో భాగంగానే చాలా సందర్భాల్లో బహిరంగంగా మద్దతు కూడా అందించారు. 2013లో మస్క్ సరదాగా డోజ్ కాయిన్ సృష్టించడంతో పాటు ఈ కాయిన్ టెస్లా ఇంక్ లో చెల్లింపులకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ పునరుద్ధరణపై అప్పట్లో బ్లూమ్ బర్గ్ అడిగిన ప్రశ్నకు ట్విటర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

ట్విటర్ లోగోను మార్చిన తరువాత డోజ్ కాయిన్ గరిష్టంగా పెరిగినప్పటికీ, మళ్ళీ పడిపోయింది. ప్రస్తుతం 13.7 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో డోజ్ కాయిన్ ఏడవ అతి పెద్ద క్రిప్టోకరెన్సీగా ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ట్విటర్ లోగోను డోజ్ కాయిన్ గా మార్చడానికి ముందు దీని మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉండేది.

(ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!)

ట్విట్టర్ సంస్థను మస్క్ కొనుగోలు చేయడానికి ముందు ఒక వ్యక్తి బ్లూ బర్డ్ స్థానంలో డోజ్ కాయిన్ మార్చాల్సిందిగా కోరాడు. అయితే అతని కోరిక మేరకు ఇప్పడూ లోగో మార్చినట్లు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ట్వీట్ చేశారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి కోరికను మస్క్ ఇంత సీరియస్ గా తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మరిన్ని వార్తలు