క్షీణించిన కొనుగోళ్లు, విలీనాల డీల్స్‌ ..నవంబర్‌లో ఎంత శాతం అంటే

13 Dec, 2022 21:30 IST|Sakshi

ముంబై: గత నెలలో కొనుగోళ్లు, విలీనాల (ఎంఅండ్‌ఏ) డీల్స్‌ విలువ 37 శాతం క్షీణించింది. 2021 నవంబర్‌తో పోలిస్తే 2.2 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. గణాంకాల ఆధారంగా గ్రాంట్‌ థార్న్‌టన్‌ రూపొందించిన నివేదిక ప్రకారం డీల్స్‌ పరిమాణం సైతం 40 శాతం తగ్గి 119కు చేరాయి.

అయితే ఈ ఏడాదిలోనే అత్యధికంగా పబ్లిక్‌ ఇష్యూలు వెల్లువెత్తాయి. గత 11 ఏళ్లలో నాలుగోసారి గరిష్టస్థాయిలో కంపెనీలు లిస్టింగ్‌ను సాధించాయి. 2022 నవంబర్‌లో ఎంఅండ్‌ఏ పరిమాణంలో స్టార్టప్‌లదే హవా. 21 శాతం లావాదేవీలు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు