వృద్ధికి ‘తయారీ’ సహకారం అంతంతే

19 Aug, 2023 04:46 IST|Sakshi

యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా

న్యూఢిల్లీ: తయారీ రంగానికి ప్రస్తుతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం ద్వారా అందుతున్న చేయూత వల్ల సమీప మూడేళ్లలో దేశ ఆరి్థక వ్యవస్థకుకానీ లేదా ఎగుమతుల రంగానికిగానీ పెద్దగా జరిగే ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చని ఫారిన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. 

ఆసియా సరఫరా చైన్‌ ఇటీవల పాక్షికంగా చైనా నుంచి మారడం, దేశ ఎలక్ట్రానిక్‌ రంగంలో ఇటీవల అందుతున్న భారీ ప్రోత్సాహకాల వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధికి తయారీ తక్షణం అందించే సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ తన్వీ గుప్తా పేర్కొన్నారు.

అయితే చైనా నుంచి సరఫరాల చైన్‌ నిరంతరం కొనసాగడం, దేశంలో వ్యవస్థాగత సంస్కరణలు వల్ల దీర్ఘకాలంలో భారత్‌ ఎకానమీకి ప్రయోజనం ఉంటుందని పేర్కొన్న ఆమె, దీనివల్ల 2023 నాటికి వార్షికంగా 6.25 శాతం నుంచి 6.75 శాతం మేర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల రేటు ఉంటుందని అన్నారు. వార్షికంగా 40 లక్షల ఉద్యోగల కల్పనా సాధ్యమవుతుందని విశ్లేíÙంచారు. పూర్తి ఆశావహ పరిస్థితుల్లో వృద్ధి 6.75 శాతం నుంచి 7.25 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కూడా పేర్కొన్నారు.  

తయారీ రంగ ధోరణులు మారాలి...
దేశంలో తయారీ రంగం పరిస్థితి గురించి ఆమె ప్రస్తావిస్తూ, తగిన ఉత్పాదక పురోగతి వ్యవస్థ లేనప్పుడు దానివల్ల ఎకానమీలకు పెద్దగా ప్రయోజనం ఒనగూడదన్నారు. తగిన ఉత్పాదక పరిస్థితి సానుకూలంగా ఉండడం అంటే విడిభాగాలను అధికంగా దిగుమతి చేసుకోవడం, వాటిని స్థానికంగా అసెంబ్లింగ్‌ చేసుకోవడానికి బదులు వాటినిసైతం స్థానికంగా తయారీ చేసుకోవడం, అందుకు ఒనరులను మెరుగుపరచుకోవడంగా ఆమె అభివరి్ణంచారు. 

‘‘భారత్‌ భారీగా దిగుమతులు చేసుకుంటోంది. ఎక్కువ ఎగుమతి చేస్తోంది. ఇలాంటి విధానాల వల్ల వాస్తవిక ప్రయోజనం అంతంతే. ఇక్కడ  మొబైల్‌ రంగాన్ని మంచి ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ భారత్‌ చైనా తర్వాత రెండవ అతిపెద్దదిగా మారింది.  అయినప్పటికీ, ప్రపంచ మొబైల్‌ ఉత్పత్తిలో భారత్‌ వాటా ఇప్పుడు 7 శాతం లోపే ఉంది. స్థానికంగా తయారీ, వనరుల సమీకరణ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా  ఈ రంగంలో మనం 25 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.’’ అని గుప్తా గురువారం ఒక కాన్ఫరెన్స్‌ కాల్‌ సందర్భంగా విలేకరులతో అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...

► డాలర్‌తో రూపాయి మారకపు విలువ డిసెంబర్‌ వరకూ  సగటున 82–83గా ఉంటుంది.  తరువాత క్రమంగా మార్చి నాటికి 79కి బలపడే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు రూపాయి బలపడటానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  
► దేశీయ ఈక్విటీలు ఇప్పుడు అధిక విలువలో ఉన్నాయి.  అందువల్ల ఈ సంవత్సరం ‘‘అండర్‌ వెయిట్‌’’ కలిగి ఉన్నాయి. దీనవల్ల ఈక్విటీలు భారీగా పెరిగే అవకాశం ఏదీ లేదు.  
► ఆగస్టులో సైతం రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 శాతం పైనే కొనసాగవచ్చు.  
► మూలధన పెట్టుబడులు ఏదన్నా జరిగితే... అది ప్రభుత్వం ద్వారానే జరుగుతోంది. కార్పొరేట్‌ల నుంచి పెద్దగా లేదు. రానున్న 12 నెలల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. వ్యవస్థలో తగిన మూలధన పెట్టుబడులు ప్రస్తుతం కొనసాగుతుండడం దీనికి కారణం. దీనికితోడు వడ్డీరేట్ల పెరుగుదల్ల వల్ల గృహ వినియోగ ధోరణి కూడా తగ్గుతోంది.

మరిన్ని వార్తలు