4వ రోజూ- రియల్టీ, బ్యాంకింగ్‌ జోరు

27 Aug, 2020 09:42 IST|Sakshi

220 పాయింట్లు అప్‌-39,294 వద్ద సెన్సెక్స్‌

64 పాయింట్లు పెరిగి 11,613 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో  అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్‌

విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో  ప్రస్తుతం సెన్సెక్స్‌ 220 పాయింట్లు జంప్‌చేసి 39,294కు చేరింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 11,613 వద్ద ట్రేడవుతోంది. వరుసగా నాలుగో రోజు బుధవారం యూఎస్‌ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. 

రియల్టీ దూకుడు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ 3.3 శాతం జంప్‌చేయగా.. మీడియా, బ్యాంకింగ్‌, ఐటీ, మెటల్, ఫార్మా 1.8-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, సిప్లా, బీపీసీఎల్‌, ఐటీసీ 3-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే  హీరో మోటో, బజాజ్‌ ఆటో, ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, శ్రీ సిమెంట్ 1-0.4 శాతం మధ్య నీరసించాయి.

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ప్లస్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, అపోలో టైర్‌, బంధన్‌ బ్యాంక్‌, ఈక్విటాస్‌, నాల్కో, సెంచురీ టెక్స్‌, అశోక్‌ లేలాండ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, జీఎంఆర్‌ 4.5-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క టీవీఎస్‌ మోటార్‌, పెట్రోనెట్‌, ఎంజీఎల్‌, కమిన్స్‌, టాటా కెమ్‌, ఐజీఎల్‌, సెయిల్‌, చోళమండలం 1.6-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1194 లాభపడగా.. 688 నష్టాలతో కదులుతున్నాయి. 

మరిన్ని వార్తలు