Today StockMarket: ఫ్లాట్‌గా సూచీలు, అదానీ షేర్ల అమ్మకాల సెగ

9 Feb, 2023 10:53 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 39.34 పాయింట్లు లేదా 0.06 క్షీణించి 60,624.45 వద్ద , నిఫ్టీ 50 34.30 పాయింట్లు లేదా 0.19శాతం పడిపోయి 17,837.40 వద్దకు చేరుకుంది.

రెండు రోజుల రికవరీ తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల  షేర్లు( ఫిబ్రవరి 9) నష్టాల్లోకి జారుకున్నాయి.  పబ్లిక్ మార్కెట్‌లలో ట్రేడింగ్ చేయడానికి తక్షణమే అందుబాటులో ఉన్న అదానీ గ్రూప్-లింక్డ్ షేర్ల సంఖ్యకు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ సమీక్ష ప్రకటించనున్న  ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఫిబ్రవరిలో సాధారణ సమీక్షలో భాగంగా. గ్లోబల్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ (GIMI)తో అనుసంధానమైన అదానీ స్టాక్‌ల మార్పులు ఈరోజు తర్వాత ప్రకటించనుంది. దీంతో అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 స్టాక్‌లు ముఖ్యంగా ప్రముఖ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 15 శాతం  కుప్పకూలింది. అంతకుముందు రెండు రోజుల్లో 35 శాతం ఎగిసింది.

క్షీణించిన ఇతర గ్రూప్ స్టాక్‌లలో అదానీ పోర్ట్స్ 7 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 5 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం, ఏసీసీ 3.7 శాతం, అంబుజా సిమెంట్ 6.3 శాతం, ఎన్‌డిటివి. 3.7 శాతం ఉన్నాయి. వీటితోపాటు, హీరోమోటో, యూపీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా కొనాసగుతున్నాయి

సెన్సెక్స్‌లో  దివీస్‌  ల్యాబ్స్‌;  బజాజ్ ఫైనాన్స్,  గ్రాసిం , బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయిలాభాల్లో ఉంది. 82.60 వద్ద కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు