బంపర్‌ ఆఫర్‌ : భారీగా తగ్గిన అంబులెన్స్‌ వాహనాల ధర

19 Jun, 2021 08:07 IST|Sakshi

ముంబై: మారుతీ సుజుకీ తన అంబులెన్స్‌ వెర్షన్‌ ‘‘వ్యాన్‌ ఎకో’’ వాహన ధరలను రూ.88 వేలు తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత ఈ మోడల్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.6.16 లక్షలుగా ఉంది. ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్‌టీ రేటును 28% నుంచి 12 శాతానికి తగ్గిస్తూ గతవారంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంబులెన్స్‌ మోడళ్ల ధరలపై కోత విధించామని కంపెనీ వివరణ ఇచ్చింది. తగ్గింపు ధరలు జూన్‌ 14 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.   

చదవండి: పబ్జీ లవర్స్‌కు మరో షాక్‌, ఊపందుకున్నబ్యాన్‌ డిమాండ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు