మారుతి బంపర్‌ ఆఫర్‌, ఏ కారు ఎంత డిస్కౌంట్ లో వస్తుందో తెలుసా?

11 Aug, 2021 11:46 IST|Sakshi

మీరు కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కొనుగోలు దారులకు మారుతీ సుజుకీ ఇండియా కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. అరీనా, నెక్సా డీలర్‌ షిప్‌లలో మారుతి వాహనాలపై క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్సేంజ్‌ బోనస్‌ తో పాటు కార్పొరేట్‌ బెన్ ఫిట్స్‌ ను ఈ నెల చివరి వరకు సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.  

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ ఉత్పత్తి సామర‍్ధ్యాన్ని పెంచడమే కాదు భారీ ఆఫర్లు ప్రకటించి ఆటో మొబైల్‌ ఇండస్ట్రీలో తమకు సాటెవ్వరూ లేరని నిరూపిస్తుంది. తాజాగా మారుతీ తన కంపెనీ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం?

మారుతి సుజుకి ఆల్టో 800


మారుతి సుజికీ ఆల్టో 800పై ప్రస్తుత ప్రారంభ ధర రూ.2.99లక్షలు ఉండగా.. ఆ ధరపై (డిస్కౌంట్‌ వర్త్‌) క్యాష్‌ డిస్కౌంట్‌ తో కలిపి రూ.43,000వరకు తగ్గించనుంది.  

మారుతి సుజుకి ఎస్‌ - ప్రెస్సో


మారుతి సుజుకి ఎస్‌- ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.78 లక్షలు ఉండగా రూ. 48,000 వరకు బెన్ఫిషియల్‌ ఆఫర్‌ను అందిస్తుంది

మారుతి సుజికి స్విఫ్ట్‌ 


మారుతి స్విఫ్ట్‌ ప్రారంభ ధర రూ.5.81లక్షలు ఉండగా.. ఆ కారుపై ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను కలుపుకొని రూ.49,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది

మారుతి సుజికి ఎస్‌ క్రాస్‌ 


మారుతి సుజికీ ఎస్‌ క్రాస్‌ కారు ప్రారంభ ధర రూ.8.39లక్షలు ఉండగా  ఆ కారుపై పర్చేస్‌ బెన్ఫిటిక్స్‌ కింద రూ.57,500వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. 

మరిన్ని వార్తలు