వరల్డ్‌ రిచెస్ట్‌ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు

9 Sep, 2023 12:02 IST|Sakshi

Shivon Zilis:వెంచర్ క్యాపిటల్ ప్రపంచం స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన  టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్  షివోన్ జిలిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్విటర్‌, టెస్లా ,స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్రెయిన్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్‌గా తన ప్రత్యకతను చాటు కుంటున్నారు జిలిస్.  అయితే బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్‌ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్‌ బయోగ్రఫీ పుస్తకం  రిలీజ్‌ కాబోతున్న తరుణంలో జిలిస్‌ మరోసారి  వార్తల్లోకి వచ్చారు.

టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని జిలిస్ నివాసంలో తీసిన రైటర్‌ వాల్టర్ ఐజాక్సన్ కవల పిల్లలతో మస్క్ ,జిలిస్ ఫోటోలను షేర్‌ చేయడం అప్పట్లో  పెద్ద సంచలన క్రియేట్‌  చేసింది.అయితే ఈ జంట  ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి (ఐవీఎఫ్‌) ద్వారా 2021లో నవంబరులో వీరికి  జన్మనిచ్చారు. ఈ  కవలల పేర్లు స్ట్రైడర్ (కొడుకు), అజూర్ (కుమార్తె) గా ఇటీవల వెల్లడైంది. దీంతో మస్క్‌ సంతానం తొమ్మిది​కి చేరింది.  ఏప్రిల్ 2022లో, కవలల పేర్లను మార్చాలని మస్క్, జిలిస్ ఒక పిటిషన్‌ను మే 2022లో టెక్సాస్ న్యాయమూర్తి ఆమోదించారు. మాజీ భార్య, కెనడా రచయిత జస్టిన్ విల్సన్‌తో.. గ్రిఫిన్, వివియన్, కాయ్, శాక్సన్, డామియన్ అనే ఐదుగురు సంతానం ఉన్నారు. వీరితోపాటు సింగర్ గ్రిమ్స్‌తో ఆయనకు గ్జాయే ఆగ్జి, ఎక్సా డార్క్ సిడరేల్ అనే  పిల్లలున్నారు. (రూ.25 కోట్ల బడ్జెట్‌, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?)

షివోన్ జిలిస్ ఎవరు?

ఎలాన్‌ మస్క్‌, జిలిస్‌ సంబంధం, అలాగే  జిలిస్‌  గురించి చాలామందికి పెద్దగా తెలియదు.  జిలిస్ కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో కె ఫిబ్రవరి 8, 1986న పంజాబీ భారతీయ తల్లి శారద , కెనడియన్ తండ్రి రిచర్డ్‌కి జన్మించారు.  అమెరికాలోని  ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు.  ఐటీ దిగ్గజం IBMలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సుపై దృష్టి సారించే వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఉన్నారు. 

2015లో మస్క్ సహ-స్థాపించిన లాభాపేక్ష రహిత సంస్థ OpenAIతో జిలిస్‌ మస్క్‌ మధ్య పరిచయం ఏర్పడింది.  పలు మస్క్ కంపెనీలలో సీనియర్ పాత్రలలో పనిచేశారు. మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెస్లాలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు.  2016 జూలైలో  మస్క్‌ స్థాపించిన న్యూరాలింక్, ఇంప్లాంటబుల్ బ్రెయిన్-మెషిన్ ఇంటర్‌ ఫేస్‌లను అభివృద్ధి చేసే న్యూరోటెక్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా పేరు పొందారు.ప్రస్తుతం న్యూరాలింక్  ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ OpenAI బోర్డు మెంబర్‌గాఉన్నారు.

 జిలిస్‌   ప్రత్యేకతలు
♦ 2015లో వెంచర్ క్యాపిటల్ విభాగంలో ఫోర్బ్స్ 30 అండర్ 30కి ఎంపికయ్యారు. 
♦  అవర్ లేడీ పీస్ అనే కెనడియన్ రాక్ బ్యాండ్ ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషీన్స్ అనే పుస్తకం తనకు ప్రేరణ అంటారు. కంప్యూటర్లు, మానవ మేథస్సును అథిగమిస్తున్న తరుణంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మానవాళి , భవిష్యత్తు గురించి  తనకు తెలిపిందని ఒక ఇంటర్వ్యూలో  స్వయంగా   జిలిస్‌  తెలిపారు. అప్పటి నుండే కృత్రిమ మేధస్సు అధ్యయనంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు.
♦ యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్-టైమ్ బెస్ట్. ఆమె గిటార్ , డ్రమ్స్ కూడా ప్లే చేసేది.
♦ అంతేకాదు మస్క్‌ తండ్రి  తండ్రి ఎర్రోల్ షివోన్‌పై ప్రశంసలు  కురిపించాడు.  2022లో ఒక ఇంటర్వ్యూలోఆ ఆమో  IQ 170 అని  ప్రకటించడం విశేషం.

కాగా స్టీవ్ జాబ్స్ , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ల ప్రశంసలు పొందిన జీవిత చరిత్రల రచయిత ఐజాక్సన్ రాసిన మస్క్‌ బయోగ్రఫీ సెప్టెంబరు 12న రిలీజ్‌ కానుంది. ఆయన రాసిన బయోగ్రఫీలు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మరి మస్క్‌ బయోగ్రఫీ  ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేయనుందో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు