లీకైన ఎంఐ11 గ్లోబల్ ధరలు

5 Feb, 2021 17:21 IST|Sakshi

షియోమీకి చెందిన ఎంఐ11 స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబందించిన యూరోపియన్ మార్కెట్ ధరలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ యొక్క ధరలను ఒక టిప్‌స్టర్ బయటకి షేర్ చేసారు. లీకైన సమాచారం ప్రకారం, ఐరోపాలో ఎంఐ11 ధర 799(సుమారు రూ.69,800) యూరొల నుంచి ప్రారంభమవుతుంది. షియోమీ యొక్క ఈ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఇప్పటికే చైనాలో తీసుకొచ్చారు. అక్కడ బేస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర చైనా యువాన్ 3,999(సుమారు రూ.45,300)గా ఉంది.(చదవండి: ఎస్‌బీఐ వినియోగదారులకు శుభవార్త!)

ఐరోపాలో ఎంఐ11 ధర(అంచనా):
టిప్‌స్టర్ సుధాన్షు షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఎంఐ11 బేస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర యూరప్‌లో యూరో 799(సుమారు రూ.69,800)కి తీసుకురానున్నట్లు సమాచారం. అదే సమయంలో 8జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 899(సుమారు రూ.78,500)గా నిర్ణయించినట్లు సమాచారం. చైనాలో లాంచ్ చేసిన మొబైల్ ధరల కంటే ధరలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఎంఐ11 ఫీచర్స్:
డ్యూయల్ నానో సిమ్ తో రాబోయే ఎంఐ11 ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12తో పనిచేస్తుంది. ఇది 6.81-అంగుళాల 2కే డబ్ల్యూఓ హెచ్ డి(1,440x3,200 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఎంఐ11లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ కెమెరా, 5ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 20మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఎంఐ11 టర్బోచార్జ్ 55వాట్ వైర్డు, 50వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు