ఆటుపోట్లలోనూ ఈ మిడ్‌ క్యాప్స్‌ జోరు

22 Sep, 2020 14:12 IST|Sakshi

అటూఇటుగా కదులుతున్న మార్కెట్లు

మధ్యతరహా కంపెనీల షేర్లకు డిమాండ్‌

జాబితాలో కేపీఐటీ టెక్నాలజీస్‌, వైభవ్‌ గ్లోబల్‌

సెంట్రల్‌ బ్యాంక్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్

తొలుత నమోదైన భారీ నష్టాల నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గుల నడుమ కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బలహీన మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో కేపీఐటీ టెక్నాలజీస్‌, వైభవ్‌ గ్లోబల్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ చోటు సాధించాయి. ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం..

కేపీఐటీ టెక్నాలజీస్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 113 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.67 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3.02 లక్షల షేర్లు చేతులు మారాయి.

వైభవ్‌ గ్లోబల్‌ 
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 1,839 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,878 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో  గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,200 షేర్లు చేతులు మారాయి.

సెంట్రల్‌ బ్యాంక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ర్యాలీ చేసి రూ. 16.75 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.19 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.31 లక్షల షేర్లు చేతులు మారాయి.

స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 3.5 శాతం లాభపడి రూ. 683 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 688 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం ఎగసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1.55 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.18 లక్షల షేర్లు చేతులు మారాయి.

>
మరిన్ని వార్తలు