చందమామే దిగి వచ్చిందా!

12 Sep, 2022 17:45 IST|Sakshi

దుబాయ్‌: డబ్బుంటే ఆ అంతరిక్షాన్నే ఎంచక్కా కిందకి దింపేసుకోవచ్చేమో కదా! లగ్జరీ లైఫ్‌కు పెట్టింది పేరైన దుబాయ్‌లో పర్యాటకుల్ని ఆకర్షించడానికి చంద్రుడి ఆకృతిలో రిసార్ట్‌ నిర్మిస్తున్నారు. ఇది రెండేళ్లలో పూర్తవుతుందట. అచ్చు చంద్రుడి ఉపరితలం మాదిరిగా డిజైన్‌ ఆకర్షణీయంగా ఉంది. 

735 అడుగుల ఎత్తైన ఈ మూన్‌ రిసార్ట్‌ దుబాయ్‌కి మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇందులో స్పా, వెల్‌నెస్‌ సెక్షన్, నైట్‌క్లబ్, ఈవెంట్‌ సెంటర్‌ ఉంటాయి. వ్యోమగాములకు, అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే సాధారణ పర్యాటకులకి శిక్షణ కూడా ఇస్తారట. 

దీనికి నిర్మాణానికి 500 కోట్ల డాలర్లు అవుతుందట. దీనిపై ఏటా 180 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని నిర్మాణ కంపెనీ అంచనా. ఈ రిసార్ట్స్‌లో ఏడాదికి కోటి మంది పర్యాటకులు ఎంజాయ్‌ చేసే వీలుంటుంది. (క్లిక్ చేయండి: సీఎన్జీ వినియోగదారులకు చేదు వార్త)

మరిన్ని వార్తలు