మరో బడ్జెట్ ఫోన్ : మోటో ఈ7 ప్లస్ 

23 Sep, 2020 13:48 IST|Sakshi

భారీ బ్యాటరీ 

బిగ్   స్క్రీన్, అల్టిమేట్  కెమెరా

సాక్షి, ముంబై:  మోటోరోలా కంపెనీ మోటో ఈ7 ప్ల‌స్ పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో లాంచ్ చేసింది.  బిగ్ స్క్రీన్, బారీ కెమెరా, 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ లాంటి ఫీచర్లతో పది వేల రూపాయల ధరలో దీన్ని అదుబాటులోకి తీసుకొచ్చింది. 

మోటో ఈ7 ప్లస్ ఫీచర్లు 
6.5  అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 460 ప్రాసెస‌ర్‌
4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్‌,
256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
48+ 2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమరా 
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ధర, లభ్యత: 
మోటో ఈ7 ప్లస్ ధర  9,499 రూపాయలు 
మిస్టీ బ్లూ, ట్విలైట్ ఆరెంజ్ క‌ల‌ర్స్ లో లభ్యం.  ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబ‌ర్ 30 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. 

మరిన్ని వార్తలు