నవీన్‌ ఫ్లోరైన్‌- రూట్‌ మొబైల్స్‌.. దూకుడు

29 Oct, 2020 13:34 IST|Sakshi

క్యూ2(జులై- ఆగస్ట్‌) ఫలితాల ఎఫెక్ట్‌

12 శాతం దూసుకెళ్లిన  రూట్‌ మొబైల్స్‌

సరికొత్త గరిష్టాన్ని తాకిన షేరు

నవీన్‌ ఫ్లోరైన్‌ ఇంటర్నేషనల్‌ 7 శాతం హైజంప్

‌చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకున్న షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ నవీన్‌ ఫ్లోరైన్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సేవల కంపెనీ రూట్‌ మొబైల్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

నవీన్‌ ఫ్లోరైన్‌ ఇంటర్నేషనల్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో నవీన్‌ ఫ్లోరైన్‌ ఇంటర్నేషనల్‌ నికర లాభం 43 శాతం ఎగసి రూ. 68 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 319 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 3.23 శాతం బలపడి 24.9 శాతానికి ఎగశాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు నవంబర్‌ 11 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవీన్‌ ఫ్లోరైన్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం దూసుకెళ్లి రూ. 2,260 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,268 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది.

రూట్‌ మొబైల్స్
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో రూట్‌ మొబైల్స్‌ నికర లాభం రెట్టింపునకుపైగా పెరిగి రూ. 33 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 349 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 2.3 శాతం బలపడి 13.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో రూట్‌ మొబైల్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 964 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం లాభపడి రూ. 990 సమీపానికి చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. కాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 25 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు