కొత్త ఏడాదిలో ఫోన్‌ బిల్లుల మోతే!

18 Nov, 2020 12:08 IST|Sakshi

కొత్త సంవత్సరంలో మీ ఫోన్ బిల్లు 15-20 శాతం పెరిగే అవకాశం

న్యూఢిల్లీ: వోడాఫోన్ ఐడియా(వి), ఎయిర్‌టెల్ వంటి టెల్కో సంస్థలు టారిఫ్‌లు పెంచాలని చూస్తున్నందున రాబోయే కొత్త సంవత్సరంలో మీ ఫోన్ బిల్లు 15-20 శాతం పెరిగే అవకాశం ఉంది. వోడాఫోన్ ఐడియా ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో చార్జీలను 15-20 శాతం పెంచాలని చూస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో కంపెనీలు నష్టాల నుండి బయటపడానికి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా ఇటీవల కొద్ది రోజులుగా రిలయన్స్ జియో మరియు ఎయిర్‌టెల్ సంస్థలకు వినియోగదారులను కోల్పోతున్నట్లు నివేదికలో తెలియ జేసింది. 

కొంత మేరకు ఎయిర్‌టెల్ సంస్థ రిలయన్స్ జియోను అనుసరిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో ఎయిర్‌టెల్ కూడా రేట్లను సవరించే అవకాశం ఉన్నట్లు  పరిశ్రమ నిపుణలు తెలుపుతున్నారు. "టెలికం రెగ్యులేటర్ ఫ్లోర్ ధరలను ప్రకటించడానికి ముందే టెల్కో కంపెనీలు టారిఫ్‌లను పెంచే అవకాశం ఉంది" అని ఒక వ్యాపార దినపత్రిక పేర్కొంది. వోడాఫోన్ ఐడియా డిసెంబరు నాటికి రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. టెల్కో సంస్థలు 20 శాతం చార్జీల పెంపుపై ప్రజలలో అంతర్గత  చర్చ జరుగుతుండగా, ఒకే సారి ఇంత మొత్తంలో పెంపు అమలు చేయడం భారమవుతుందని ప్రజల అభిప్రాయం. 2016లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రవేశించిన తరువాత దేశంలోని మూడు ప్రైవేట్ టెల్కోలు గతంలో 2019 డిసెంబరులో రేట్లు పెంచాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు