StockMarketClosing: ప్రాఫిట్‌ బుకింగ్‌,ఆరంభ లాభాలు ఆవిరి

9 Nov, 2022 16:08 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభ లాభాలను   వెంటనే కోల్పోయిన సూచీలు రోజంతా అదే ధోరణిని కంటిన్యూ చేశాయి. అయినా సెన్సెక్స్‌ 61 వేలకు ఎగువన, నిఫ్టీ 18150స్థాయిని నిలబెట్టుకున్నాయి.

ఫార్మా, మెటల్ సూచీల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. అలాగే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు, రేపు వెలువడనున్న యూఎస్‌ ద్రవ్యోల్బణం డేటాపై పెట్టుబడి దారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్‌ 152 పాయింట్లను కోల్పోయి 61033 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 18157 వద్ద ముగిసాయి. అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, ఐటీసీ, హీరోమోటో, డా. రెడ్డీస్‌ లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, పవర్‌గగ్రిడ్‌, దివీస్‌ ల్యాబ్స్‌, టెక్‌ ఎం, గ్రాసిం భారీగా నష్టపోయాయి. 

అటు డాలరు మారకంలో రూపాయి 45పైసలు ఎగిసి 81.44  వద్ద ముగిసింది. సోమవారం  81.92 వద్ద  82 మార్క్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు