ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గా నీరజ్‌ చోప్రా

7 Jan, 2022 07:51 IST|Sakshi

ముంబై: ఒలింపిక్‌లో పసిడి పతకం సాధించిన అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా తాజాగా ఇతర సెలబ్రిటీ క్రీడాకారుల బాటలో... ఏంజెల్‌ ఇన్వెస్టరుగా మారారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాం వన్‌ ఇంప్రెషన్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. ఇతర ఇన్వెస్టర్లతో కలిసి చోప్రా కూడా పెట్టుబడులు పెట్టినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఆయన ఎంత మేర ఇన్వెస్ట్‌ చేసినదీ మాత్రం వెల్లడించలేదు. ఇటీవలి విడతలో పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 7.4 కోట్లు) సమీకరించినట్లు వన్‌ ఇంప్రెషన్‌ తెలిపింది.

మామాఎర్త్‌కి వ్యవస్థాపకుడు వరుణ్‌ అలగ్, పీపుల్‌ గ్రూప్‌ వ్యవస్థాపక సీఈవో అనుపమ్‌ మిట్టల్, స్టాండప్‌ కమెడియన్లు జకీర్‌ ఖాన్‌ .. కనన్‌ గిల్‌ తదితరులు వీరిలో ఉన్నట్లు పేర్కొంది. బ్రాండ్లు, క్రియేటర్లకు అవసరమయ్యే సొల్యూషన్స్‌ను రూపొందించేందుకు తాజాగా సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు వన్‌ ఇంప్రెషన్‌ తెలిపింది. ప్రస్తుతం వార్షికంగా 7 మిలియన్‌ డాలర్ల ఆదాయం ఉంటోందని.. 2022 నాటికి దీన్ని 35 మిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.   
 

చదవండి: మహీంద్రా ఎక్స్‌యూవీ700 జావెలిన్‌ ఎడిషన్‌పై ఓ లుక్కేయండి..!

మరిన్ని వార్తలు