పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ

4 May, 2021 15:25 IST|Sakshi

హైదరాబాద్: అసలే దేశంలో ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మరోపక్క నిత్యవసర, అత్యవస వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో స్థానిక లాక్ డౌన్ లతో ఉద్యోగాలు పోయి సామాన్య ప్రజానీకం భాదపడుతుంటే స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోగా పొగ.. ప్రజల బాధలతో సంబంధం లేకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ చేశాయి. ఆదేమని అడిగితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి అందుకే మేము కూడా పెంచాల్సి వచ్చినట్లు చెబుతున్నాయి.

ప్రస్తుతం పెరిగింది పైసాలలోనైన ఇలా కొన్ని రోజులు పెరగిన పెంపును కలిపితే అవి మనకు రూపాయిల్లో కనిపిస్తాయి. అప్పుడు అర్ధం అవుతుంది ఎంత ఎక్కువ పెంచేశారో అని. చమురు ధరలు పెరగడం వల్ల ప్రతి నిత్యవసర వస్తువు మీద పెట్రో ధరల ప్రభావం పడుతుంది. ఫిబ్రవరి 23 తర్వాత వచ్చిన ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి నుంచి పెట్రో ధరలను పెంచలేదు. అవి అయిపోయిన వెంటనే ధరలను మళ్లీ పెంచేశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెంచింది. మంగళవారం పెట్రోల్ లీటరుకు రూ.90.55, డీజిల్ లీటరుకు రూ.80.91 చొప్పున  రిటైల్ కు అమ్ముతున్నాయి.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కి రూ.0.17 పైసలు పెరిగి రూ.94.16కి చేరుకుంటే, డీజిల్ ధర లీటర్ రూ.0.20 పెరిగి రూ.88.25 అయ్యింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ 92.12 ఉండగా డీజిల్ ధర రూ.89.72 ఉంది. ధరలు పెరుగుదలకు ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, వాస్తవానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ధరలు పెంచితే ప్రజలు ఆగ్రహంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయరన్న ఉద్దేశంతో బలవంతంగా ధరలను స్థిరంగా ఉంచారనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ చమురు ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇంధన ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి.

చదవండి:

భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు

మరిన్ని వార్తలు