పార్లమెంట్‌ సమావేశాలు, స్థిరంగా పెట్రో ధరలు

20 Jul, 2021 09:19 IST|Sakshi

పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా దేశ వ్యాప‍్తంగా వాహనదారులు తమదైన స్టైల్లో చేస్తున్న నిరసన కొనసాగుతుంది. పార్లమెంట్‌ వర్షాకాల నేపథ్యంలో పెరుగుతున్న చమురు ధరలు తగ‍్గించే విషయంపై ప్రధాని మోదీ ప్రసంగించాలని కోరుకుంటున్నారు. ఓవైపు పెట్రోల్‌ బంకుల్లో కార‍్లపైకెక్కి అర్ధనగ్నంగా దండాలు పెడుతుంటే,మహిళలు పెట్రోల్‌ బంకుల్లో తమ మొర ఆలకించాలంటూ మోదీ ఫ్లెక్సీకి దణ్ణాలు పెడుతున్నారు. నెటిజన్లు సైతం #ThankYouModiJiChallenge అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.ఈ నిరసనతో పెట్రో ధరలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా' అని అందరు ఆసక్తిగా ఎదురు చూస‍్తున్నారు.  

ఇక, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మంగళవారం రోజు  చమురు ధరలు స‍్థిరంగా కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరడగంతో.. దేశీయంగా పెట్రో  ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఈ నెలలో ఈ ఇరవై రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఒక్క ఢిల్లీలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం పెట్రోల్ 63 పర్యాయాలు, డీజిల్ 61సార్లు పెరిగింది.

మంగళవారం పెట్రోల్‌,డీజిల్‌ ధరల వివరాలు 

ముంబై లీటర్‌ పెట్రోల్‌ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది

ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది

చెన్నైలో పెట్రోల్‌ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది

కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది

హైదరాబాద్‌ లో పెట్రోల్‌ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది

 బెంగళూరు లో పెట్రోల్‌ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది

చదవండి: 'పెగసస్‌' చిచ్చు, సర్వీస్‌లను షట్‌ డౌన్‌ చేసిన అమెజాన్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు