ఫోన్‌పే,గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు షాక్‌.. యూపీఐ చెల్లింపులపై లిమిట్‌!

3 Jan, 2023 17:02 IST|Sakshi

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రాకతో నగదు భారత్‌లోని చెల్లింపుల వ్యవస్థనే మార్చివేయడమే కాదు ఈ విభాగంలో సరికొత్త విప్లవానికి దారితీసింది. అందుకే ఇటీవల ఎక్కువగా ఉపయోగించే రోజువారీ చెల్లింపు పద్ధతిగా మారింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు పద్ధతి దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉంది. దీని రాకతో బయటకు వెళ్లే సమయంలో ప్రజలు నగదు లేదా వాలెట్‌ను మోసుకెళ్లే భారం తప్పిందనే చెప్పాలి.. 

కేవలం జేబులో స్మార్ట్‌ఫోన్ అందులో గూగుల్‌ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe), పేటీఎం (Paytm),  అమెజాన్‌ పే (Amazon Pay) వంటి వివిధ యాప్‌ల ఉంటే బ్యాంక్‌ ఖాతా, యూపీఐ, ఈ యాప్‌లు ఉండే ఎవరికైనా చిటికెలో నగదు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. మీ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే మొత్తంపై పరిమితి ఉందని మీకు తెలుసా?

యూపీఐ చెల్లింపులు.. లిమిట్‌ ఇదే
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, ఒక వినియోగదారుడు ఒక రోజులో యూపీఐ ద్వారా రూ. 1 లక్ష వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేయగలరు. ఇది కాకుండా, మీరు ఒక రోజులో యూపీఐ ద్వారా డబ్బులు బదిలీ చేయాలంటే అది మీ బ్యాంక్,  మీరు ఉపయోగిస్తున్న యాప్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం!

గూగుల్‌పే
గూగుల్‌ పే (Google Pay) లేదా జీపే (GPay) వినియోగదారులు యూపీఐ (UPI) ద్వారా ఒక్క రోజులో రూ. 1 లక్ష కంటే ఎక్కువ చెల్లింపులు చేయలేరు. ఇది కాకుండా, యాప్ వినియోగదారులను ఒక రోజులో 10 కంటే ఎక్కువ లావాదేవీలు కూడా చేసేందుకు అనుమతి ఉండదు. దీనర్థం జీ పే యూజర్లు ఒకే సారి ఒక లక్ష రుపాయల లావాదేవీ లేదా వివిధ మొత్తాలలో 10 లావాదేవీల వరకు చేయవచ్చు. ఆపై ఈ యాప్‌ నుంచి పేమెంట్స్‌ చేయలేము.

పేటీఎం
ఎన్‌పీసీఐ (NPCI) ప్రకారం, పేటీఎం ( Paytm )కూడా ఒక రోజులో రూ. 1 లక్ష వరకు మాత్రమే చెల్లింపును అనుమతిస్తుంది. కాకపోతే యూపీఐ చెల్లింపుల విషయంలో పేటీఎంకి ఎలాంటి పరిమితి లేదు.

ఫోన్‌పే
ఫోన్‌పే (PhonePe) గూగుల్‌ పే (Google Pay) తరహాలోనే ఒక రోజుకు చెల్లింపు పరిమితి రూ. 1 లక్ష ఉంటుంది. అయితే ఇందులో ఒక రోజులో 10 లావాదేవీలు మాత్రమే చేయాలనే పరిమితి లేదు.  ఒక రోజులో రూ.లక్ష విలువ మించకుండా వినియోగదారులు ఎన్ని పేమెంట్స్‌ అయినా చేసుకోవచ్చు.

అమెజాన్ పే
అమేజాన్‌ పే (Amazon Pay) UPI ద్వారా రూ. 1 లక్ష వరకు చెల్లింపులు చేయవచ్చు. లేదా ఒక రోజులో 20 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. కొత్త కస్టమర్లు మొదటి 24 గంటల్లో రూ. 5,000 వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేయగలరు.

చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్‌.. నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తే పైసలు కట్టాలి!

మరిన్ని వార్తలు